హోమ్ /వార్తలు /తెలంగాణ /

Best Tourist place: మీ పిల్లలను ఈ పార్కుకి తీసుకెళ్లారంటే కేరింతలే కేరింతలు: ఆహ్లాదం పంచుతున్న డీర్ పార్క్

Best Tourist place: మీ పిల్లలను ఈ పార్కుకి తీసుకెళ్లారంటే కేరింతలే కేరింతలు: ఆహ్లాదం పంచుతున్న డీర్ పార్క్

డీఆర్​

డీఆర్​ పార్కు

ప్రాజెక్టు చుట్టూ పరిసర ప్రాంతాలు సైతం పచ్చదనంతో కళకళలాడుతుంది. దీంతో ఆగష్టు - అక్టోబర్ మధ్య ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉంది. అదే డీర్ పార్క్.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  వారాంతాల్లో తమ పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు అనేక మంది తల్లిదండ్రులు కొత్త ప్రాంతాలు (Tour) వెళ్తుంటారు. అయితే మరీ దూర ప్రాంతాలకు వెళ్లినా ఎంజాయ్ చేయడానికి సమయం సరిపోదు. అందుకే ప్రత్యేకించి ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని ముందుగానే టూర్ ప్లాన్ (Tour plan) చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా రెండు రోజుల పాటు హాయిగా గడపొచ్చు. అటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్ (Best Tourist place) మన భద్రాచలంలో (Bhadrachalam) ఉంది.

  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలం యానంబైలు గ్రామ పంచాయతీ పరిధిలో కిన్నెరసాని ప్రాజెక్టు ఎంతో ఫేమస్. వానాకాలం సీజన్లో ఈ ప్రాజెక్ట్‌ జలకళ సంతరించుకుని ఎంతో ఆహ్లాదం పంచుతుంది. ప్రాజెక్టు చుట్టూ పరిసర ప్రాంతాలు సైతం పచ్చదనంతో కళకళలాడుతుంది. దీంతో ఆగష్టు - అక్టోబర్ మధ్య ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉంది. అదే డీర్ పార్క్ (DR park). పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పాల్వంచ (Palvancha) పట్టణానికి అతి సమీపంలో కిన్నెరసాని ప్రాజెక్టు (Kinnerasani Project) ఒడ్డునే ఈ డీర్ పార్క్ ఉంటుంది.

  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పార్కును చూసేందుకు సందర్శకులకు అనుమతిస్తున్నారు. ప్రవేశ రుసుముగా పెద్దలకు రూ.30, పిల్లలకు రూ15, ద్విచక్ర వాహనానికి రూ. 15, కారు - జీపు మొదలైన వాహనాలకు రూ. 50, కెమెరాకు రూ. 50, వీడియో కెమెరాకు రూ. 250, సినీ చిత్రీకరణకు రూ. 2250 ధరల చొప్పున ప్రవేశ రుసుమును నిర్ణయించారు.


  ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1974 సెప్టెంబర్ 29న కిన్నెరసాని ప్రాజెక్టు కేంద్రంగా ఈ డీర్ పార్కును ప్రారంభించారు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ పర్యాటక ప్రాంతంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ జింకల పార్కును అభివృద్ధి చేశారు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జింకల పార్కు తొలినాళ్లలో 8 జింకలు, నాలుగు కొండ గొర్రెలతో ప్రారంభమైంది. ఈ పార్కును సింగరేణి యాజమాన్యం పర్యవేక్షించింది. అనంతరం 2000వ సంవత్సరంలో కొన్ని అనుకోని ఘటనల కారణంగా ఈ జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించింది సింగరేణి యాజమాన్యం.

  డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్ .9491088391

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Best tourist places, Bhadrachalam, Bhadrari kothagudem, Children, Local News

  ఉత్తమ కథలు