తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (Ts Intermediate Exams) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష నిర్వహించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే ఈ సారి ఇంటర్ పరీక్షలు (Inter Exams) అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో రాస్తున్నారు. 9.47 లక్షల మంది విద్యార్థుల్లో 8.40 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే హాజరవుతున్నారు.అయితే పలు చోట్ల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు ఎగ్జామినేషన్ హాల్‌లోకి అనుమతించలేదు.
అయితే ఓ విద్యార్థి గూగుల్ మ్యాప్ నమ్మి పరీక్ష తప్పాడు. తన ఎగ్జామినేషన్ హాల్ కోసం గూగుల్ మ్యాప్‌ను నమ్మిన స్టూడెంట్.. ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసే అవకాశం కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి ఏకంగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరాడు.. కానీ, అది మరో లొకేషన్ చూపించడంతో.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే సరికి అరగంట ఆసల్యం అయ్యింది. దీంతో ఈ సారికి ఎగ్జామ్ రాసే పరిస్థితి లేకుండా పోయింది.
తాను చేరుకోవాల్సిన సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో అక్కడికి చేరుకున్నాడు.. తీరా అది కాదని తెలిసిన తర్వాత.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. 27 నిమిషాల ఆలస్యం అయ్యింది. దీంతో.. ఎగ్జామ్ సెంటర్‌లోకి సదరు విద్యార్థిని అనుమతించలేదు సిబ్బంది.. ఖమ్మంలోని ఎన్ఎస్ పి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామం చెందిన వినయ్ అనే ఇంటర్ ఆ విద్యార్థి.. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి బయల్దేరడంతో ఈ పరిస్థితి వచ్చింది.. ఇక, చేసేదేమీ లేక విద్యార్థి తిరిగి వెళ్లిపోయాడు.. విద్యార్థులు ముందుగా ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలని.. ఎగ్జామ్ సెంటర్‌కు ముందుగానే చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావొద్దని... ముందు నుంచే విద్యాశాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Inter Exams 2023, Inter exams, Khammam, Local News, Telangana intermediate board exams