Dasari Kranthi Kumar, News18.
ఏజెన్సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనకడుగు వేయాల్సి వస్తుంది. కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పుస్తకాలతో కుస్తీ పట్టి మార్పులు తెచ్చుకున్న లక్ష్య సాధనలో తడబడుతున్నారు. దీనికి కారణం సరిపడా నైపుణ్యాలు కొరవడమే. దీన్ని గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేశారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి విద్య కోర్సులు సైతం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు కాలేజీ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు ఉండేవి. కొన్నిచోట్ల ఆదర్శ పాఠశాలలో వీటిని అమలు చేస్తున్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఈ ఏడాది ఈ పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టారు. జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 2022- 23 విద్యాసంస్థలానికి 7 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నుంచి కంప్యూటర్ బ్యూటిషన్ వెల్నెస్ పర్యాటకం వినోదం వ్యాయామం కుట్లు అల్లికలుగ్య పరిరక్షణ వ్యవసాయం వంటి కోర్సులను ప్రభుత్వ పాఠశాలలో బోధించేందుకు ప్రభుత్వ అధికారులు నిర్ణయించగా భద్రాచల పట్టణంలోని నన్నపనేని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోరిక మేరకు రెండు కోర్సులను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏడాది తొమ్మిదో తరగతిలో 86 మంది విద్యార్థులు ఉండగా ఇందులో బాలులు వ్యవసాయ రంగాన్ని ఎంచుకోగా బాలికలు కుట్టుమిషన్లో తర్ఫీదు పొందేందుకు ఆసక్తి కనబరిచారు. ఇది రెండేళ్ల కోర్సు . ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులందరూ వచ్చే ఏడాది ఎస్సెస్సీ పరీక్షలతో పాటు వృత్తి విద్యకు సంబంధించిన అంశంపై పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన వారికి పదో తరగతి మెమోతో పాటు వొకేషనల్ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. భద్రాచలంతో పాటు బూర్గంపాడు మండలం సారపాక, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట పాఠశాలల్లో పలు వృత్తివిద్య కోర్సులు మంజూరయ్యాయి.
ఇవన్నీ జిల్లా పరిషత్ విద్యాలయాలే. ఇందులో పాల్వంచలో రెండు జడ్పీ పాఠశాలలు ఉన్నాయి. కొత్తగూడెంలో జూనియర్ కళాశాలకు కోర్సులు కేటాయించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు న్యూస్ 18 తో మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో వృత్తి విద్యా ధ్రువపత్రం ఉండటం ద్వారా ఇంటర్ వొకేషనల్ కోర్సులను సులువుగా అర్థం చేసుకోవచ్చు. నేరుగా చేరేవారితో పోల్చితే వీరికి 'అవగాహన శక్తి ఎక్కువ. చదువు పూర్తయ్యాక ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా వృత్తివిద్య ద్వారా ఉపాధి పొందవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana