ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో (Bhadrachalam Temple) స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు ఆలయ అధికారులు. ఆలయ ప్రాంగణంలోనిచిత్రకూట మండలంలో నిర్వహించిన ఈ లెక్కంపులో 84రోజులకు గాను మొత్తం రూ.2 కోట్ల 20 లక్షల 91వేల 906 సొమ్ము సమకూరినట్లుగా ఆలయ వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా250 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, 499 యుఎస్ డాలర్లు, 55 కెనడా డాలర్లు, సింగపూర్ కుచెందిన 85 డాలర్లు, ఆస్ట్రేలియాకు చెందిన 180, న్యూజిలాండ్ కు చెందిన 10 డాలర్లు హుండీ ద్వారా దేవస్థాన ఖజానాకు చేరినట్లు ఆలయ వర్గాలు తెలియజేశారు. వీటితోపాటు ఒమన్ కు చెందిన 200బైసా, కువైట్ కు చెందిన దీనార్, సౌత్ ఆఫ్రికాకు చెందిన 30 రూడ్స్, సౌదీ అరేబియాకు చెందిన 36 రియాల్స్, యూఏఈకి చెందిన 125 దీరామ్స్, యూరప్ కు చెందిన 140 యూరోస్ వచ్చాయి.
చివరిసారిగా హుండీ లెక్కింపు 2022 నవంబరు 10న నిర్వహించగా 84రోజుల అనంతరం ఫిబ్రవరి 2న లెక్కించారు. కార్తీకమాసం, ముక్కోటి, సంక్రాంతి పండగలు, సెలవులను పురస్కరించుకొని ఈసారి స్వామివారి ఖజానాకు ఆశాజనకంగా హుండీ ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ పర్యవేక్షించగా ఏఈవోలు శ్రావణ్ కుమార్, భవానీరామకృష్ణారావు, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, నిరంజన్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ రవీంద్రనాధ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉండి ఆదాయాన్ని లెక్కించేందుకు ఆలయంలో అవుట్సోర్సింగ్ సిబ్బందితోపాటు పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు సైతం పాల్గొన్నారు.
ఆలయ రక్షణ సిబ్బంది ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలను ఏర్పాటు చేయగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో సహస్ర కలశాభిషేక మహోత్సవాలకు ఫిబ్రవరి 3న అంకురార్పణ చేయనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన సహస్ర కలశావాహనం, హవనం, పునర్వసుసేవ, చుట్టు సేవ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న సహస్ర కలశాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
అలాగే రంగనాయకస్వామి వారికి వార్షిక తిరుకల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇదే సమయంలో విశేష బోగ నివేదన, తిరువీధి సేవ చేయనున్నారు. సహస్ర కలశాభిషేక మహోత్స వాలను పురస్కరించుకొని ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నిత్యకల్యాణాలకు విరామం ఇవ్వను న్నారు. అదేవిధంగా పట్టాభిషేకం సైతం నిర్వహించరు. ఆరు నుంచి నిత్య కల్యాణాలను పునరుద్ధరిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana