హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయలేదా? ఇంట్లో కూర్చొని ఇలా చేసుకోండి..!

ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయలేదా? ఇంట్లో కూర్చొని ఇలా చేసుకోండి..!

X
పాన్-ఆధార్

పాన్-ఆధార్ లింక్ చేయండిలా

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన ఖాతాదారులు, ఆర్థిక లావాదేవీలను చేసే ప్రజలు తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం (Aadhar Pan Card Link) చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకోనివాళ్లు తొందరపడాల్సిన సమయం వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన ఖాతాదారులు, ఆర్థిక లావాదేవీలను చేసే ప్రజలు తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం (Aadhar Pan Card Link) చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకోనివాళ్లు తొందరపడాల్సిన సమయం వచ్చింది. ఈ రెండింటిని మార్చి నెలఖరులోపు అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే ఏప్రిల్ నుంచి పాన్ కార్డు సహాయంతో జరిగే లావాదేవీలు జరపమని ఒకరకంగా చెప్పాలంటే పాన్ కార్డే పనిచేయదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం,సహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్ అందరూ తేదీ మార్చి 31 లోపు తమ పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఏప్రిల్ 1 నుండి అనుసంధానం చేయబడని పాన్ కార్డు పనికి రాకుండా పోతుందని గతంలోనే ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.

అస్సాం, జమ్మూకాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులకు మినహాయింపు ఇచ్చినట్లు 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిర్వచించిన నాన్-రెసిడెంట్, మునుపటి సంవత్సరంలో ఏ సమయంలోనైనా కనీసం 80 సంవత్సరాల వయస్సు ఉండి, భారతీయ పౌరసత్వం లేని వారు కూడా ఈ వర్గంలోకి వస్తారని పేర్కొంది.

ఇది చదవండి: కొత్తగా వ్యాపారం చేయాలని భావిస్తున్నారా..? రూ.50 లక్షల లోన్ పొందే ఛాన్స్.. వివరాలివే..!

ఈ నేపథ్యంలో అనుసంధానం కాని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్స్ సమర్పించడం సాధ్యం కాదు. పెండింగ్లో ఉన్న రిటర్న్ సైతం ప్రాసెస్ కావు. పెండింగ్ లో ఉన్న ప్రొసీడింగ్స్ పూర్తి కావు. రీఫండ్స్ పొందడమూ కుదరదు. పన్ను మినహాయింపులకు అధిక రేటు వర్తిస్తుంది. ఈ క్రమంలోఆధార్ కార్డును పాన్ కార్డు అనుసంధానం చేసేందుకు సులువు పద్ధతిని అనుసరిస్తే తమ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. కేవలం రెండు నిమిషాల సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించి తమ తమ పాన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేసుకునేందుకు ఈ విధంగా ప్రయత్నించవచ్చు.

1. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ అధికారిక వెబ్సైట్ eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.inకి వెళ్లండి

2. పోర్టల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది.

3. మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ పుట్టిన తేదీని రిజిస్టర్ చేయడం ద్వారా పోర్టల్ లోకి లాగిన్ అవ్వండి.

4. మీ పాన్ ను ఆధార్ లింక్ చేయాలని అడుగుతున్న పాప్ అప్ విండో ఇప్పుడు కనిపిస్తుంది.

5. విండో కనిపించకపోతే, మెనూ బార్లోని 'ప్రొఫైల్ సెట్టింగ్స్'కి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.

6. మీ పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టినతేదీ, లింగం వంటి సమాచారం అప్పటికే కనిపిస్తుంది.

7. ఆధార్లో పేర్కొన్నవాటితో స్క్రీన్ పై పాన్ వివరాలను వెరిఫై చేయండి.

8. ఏవైనా తేడాలు ఉంటే డాక్యుమెంట్లలో మార్పులు చేసుకోవాలి.

9. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్ను రిజిస్ట్రేషన్ చేసి, 'లింక్ నౌ' బటన్ పై క్లిక్ చేయండి.

10. మీ ఆధార్ పాస్ కి విజయవంతంగా అప్ మెసేజ్ లింక్ అయ్యిందంటూ ఒక పాప్ వస్తుంది.ఈ పద్ధతిని అనుసరించి ఇంకా పాన్ కార్డుకు ఆధార్ కార్డుతోఅనుసంధానం చేయని వారు అనుసంధానం చేసుకోవచ్చు.

First published:

Tags: Aadhaar Card, Bhadradri kothagudem, Local News, PAN card, Telangana

ఉత్తమ కథలు