హోమ్ /వార్తలు /తెలంగాణ /

ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు..

ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు..

X
అంబరాన్ని

అంబరాన్ని తాకిన సంబరాలు

Telangana: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు.  ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిహిస్తుండగా.. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అత్యంత ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా మేల తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ పూజలు పూర్తయిన అనంతరం గోదావరి తీరం నుంచి పట్టణంలోని ఆలయం వద్దకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని పురవీధుల్లో అమ్మవారి శోభాయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో శోభాయాత్ర వద్దకు తరలివచ్చారు. అనంతరం భద్రాచల పట్టణంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ రోడ్డులో గల ముత్యాలమ్మ తల్లి ఆలయానికి ఊరేగింపు చేరుకోగా అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ చీరలు గాజులు సమర్పించి మొక్కలు చెల్లించారు.

ఈ సందర్భంగా పలువురు భక్తులకు అమ్మవారు పోనడంతో ఆలయమంతా అమ్మవారి భక్తులతో కిటకిటలాడింది. అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు ఆలయ కమిటీ సభ్యులు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచిత అన్నప్రసాద వివరాతన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సాయంత్రం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ఈ కార్యక్రమాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించగా.. ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీని ఘనంగా సత్కరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూజలు జరగగా జిల్లా వ్యాప్తంగా పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని వారి వారి మొక్కులను చెల్లించారు.

భద్రాచల పట్టణంలో అతి పురాతన ఆలయంగా గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏడాది జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ , ఆంధ్రా, చతిస్గడ్ రాష్ట్రాల నుంచి అమ్మవారి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయగా ‌, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రాచలం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేశారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు