హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadrachalam:  పుష్కర పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు.. వీవీఐపీలకు ఆహ్వానం..!

Bhadrachalam:  పుష్కర పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు.. వీవీఐపీలకు ఆహ్వానం..!

భద్రాచలంలో పుష్కర పట్టాభిషేకానికి ఏర్పాట్లు

భద్రాచలంలో పుష్కర పట్టాభిషేకానికి ఏర్పాట్లు

శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుక తరువాత మరుసటి రోజు నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి దేవస్థానం వైదిక కమిటీ, పరిపాలన అధికారులు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Kothagudem | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) లోని సీతారామచంద్రస్వామి దేవస్థానం (Bhadrachalam Temple) ఆధ్వర్యంలో శోభకృత్ సంవత్సరంలో (2023) ఏప్రిల్ మాసంలో జరగబోయే శ్రీరామ నవమి వేడుక తరువాత మరుసటి రోజు నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి దేవస్థానం వైదిక కమిటీ, పరిపాలన అధికారులు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దేశంలో రెండవ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్స హవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలనే యోచనలో దేవస్థానం వర్గాలు ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రులను సైతం సంప్రదాయ రీతిలో ఆహ్వానించాలని నిర్ణ యించినట్లు తెలుస్తోంది. ఈ మహోన్నత కార్యక్రమాన్ని చినజీయస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్ణయించాలని దేవస్థానం వైదిక వర్గాలు భావిస్తున్నాయి.

అలాగే వివిధ వైదిక సంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులను రోజుకు ఒకరిని ఆహ్వానించి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పుష్కర మహా సామ్రాజ్య పట్టాభిషేకం భద్రాద్రి రామయ్యకు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను, ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది చదవండి: టెక్నాలజీకి దూరంగా ఆ ఆలయం.. భక్తులకు సేవలెలా..?

ఇదిలా ఉండగా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి దేశంలోని 12నదుల నుంచి తీర్థ జలాలను సేకరించి తేవాలని, ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా దేవస్థానం పరిపాలన, వైదిక సిబ్బందిలో 12మంది చొప్పున విభాగాలను రూపొందించి బృందాలకు రామాయణం ఇతి వృత్తంతో ముడిపడి ఉన్న పేర్లను పెట్టాలని భావిస్తున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలోని అన్ని ఇళ్లపై తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ధ్వజాలను(శ్రీరాముని పేరు చిత్రపటంతో ఉన్న జెండాలు) ఎగురవేయాలని నిర్ణయించారు.

ఇది చదవండి: 80ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డులేదు.. జనం ఇబ్బందులు ఇంతింతకాదయా..!

కాగా 1987లో జరిగిన మహాసామ్రాజ్య పట్టాభిషేకం కోసం చేయించిన వెండి సింహాసనమే ఇప్పటి వరకు స్వామి వారికి వినియోగిస్తుండటంతో త్వరలో స్వామి వారికి స్వర్ణ (బంగారు) సింహాసనాన్ని సిద్ధం చేయాలనే యోచనలో ఉన్నట్లుగా దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సావనీర్ను కూడా రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి నిర్వహించే పుష్కరసామ్రాజ్య పట్టాభిషేకం ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా నిర్వ హించాలని, తద్వారా భద్రాద్రి అభివృద్ధికి అవకాశం ఉంటుందని దేవస్థానం వర్గాలు భావిస్తున్నాయి.

ఇది చదవండి: ఆ జిల్లాలో రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భూమిపై హక్కు పత్రాలు

ఇంత గొప్ప స్థాయిలో నిర్వహించే పుష్కర సామ్రాజ్య, పట్టాభిషేకానికి భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది ప్రాథమికంగా కసరత్తు నిర్వహించగా కీలక అంశాలపై మరికొన్నిసార్లు సమావే శమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా దేవస్థానం ఆధ్వర్యంలో భారీగా ఉత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించి భక్తులకు మరింతగా చేరువకావాలనే భావనతో దేవస్థానం అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఇదే విషయమై దేవస్థానానికి చెందిన ఓ కీలక అధికారిని న్యూస్ 18 తో మాట్లాడుతూ రాబోయే శోభకృత్ సంవత్సరంలో (2023) భద్రాద్రి దేవస్థానం పరిధిలో భారీ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు