హోమ్ /వార్తలు /తెలంగాణ /

Oil palm: ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై ప్రభుత్వం దృష్టి: రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పంట..

Oil palm: ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై ప్రభుత్వం దృష్టి: రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పంట..

కొత్తగూడెంలో

కొత్తగూడెంలో ఆయిల్​పాం

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం, ప్రోత్సాహంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా.. రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆయిల్‌పామ్ (Oil Palm) సాగు విస్తీర్ణం, ప్రోత్సాహంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా.. రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే విస్తరణ కోసం రూ.1,000 కోట్లు కేటాయించిన సర్కారు.. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 26 జిల్లాల్లో 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పామాయిల్‌ సాగులో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానం, ఖమ్మం (Khammam) జిల్లా ద్వితీయస్థానంలో నిలిచి ఇతర జిల్లా రైతులకు మార్గదర్శిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పామాయిల్‌ తోటలను పరిశీలించి వెళుతున్నారు.

  భద్రాద్రి కేంద్రంగా ఆయిల్ పామ్ మొక్కల పెంపకం:

  ప్రధానంగా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పామాయిల్‌ దిగుబడులు అధికంగా ఉండడంతో అక్కడ ఇతర పంటలు తొలిగించి పామాయిల్‌ సాగు పెంచుతుండగా.. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోనూ పామాయిల్‌ సాగు విస్తరిస్తోంది. ఈక్రమంలో రైతులకు ప్రభుత్వమే నాణ్యమైన పామాయిల్ మొక్కలను అందించేందుకు పామాయిల్ నర్సరీలను సైతం ఏర్పాటు చేసి సబ్సిడీ ప్రాతిపదికన ఈ మొక్కలను రైతులకు పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని నారవారిగూడెంలో కేంద్రీయ ఆయిల్ ఫామింగ్ నర్సరీని ఏర్పాటు చేశారు.

  2010లో 63 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆయిల్ ఫామ్ నర్సరీ.. దశల వారీగా అభివృద్ధి చెందుతూ నేడు 8 లక్షలకు పైగా పామాయిల్ మొక్కలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తుంది.

  సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు:

  ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 41వేల ఎకరాలు, ఖమ్మంజిల్లాలో 10వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతుండగా.. భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది మరో 25వేలు, ఖమ్మం జిల్లాలో 15వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలను విస్తరించేందుకు యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం రైతులకు ఉచితంగా మొక్కలతో పాటు నాలుగేళ్ల పాటు ఎరువులు, పురుగుల మందులు కోసం ఏడాదికి హెక్టారుకు రూ. 5250 చొప్పున కూపన్లు అందించనున్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీపై డ్రిప్‌ఇరిగేషన్, గెలలు కత్తిరించే యంత్రాలు, ఇతర ప్రాసెసింగ్‌ పరికరాలు కూడా అందించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు ఈ కేంద్రీయ ఆయిల్ ఫార్మింగ్ నర్సరీని సందర్శించి మొక్కలను సబ్సిడీ పద్ధతిలో పొందుతున్నారు.

  Rajanna Siricilla: గ్రామ శివారులో చిరుత పులి సంచారం: బిక్కుబిక్కుమంటున్న ఊరి జనం

  ఆయిల్ ఫామింగ్ విత్తనాలను మలేషియా, కోస్టారికా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అధికారులు, దిగుమతి చేసుకున్న విత్తనాలను శుభ్రపరచి నీడ ఉన్న బహిరంగ ప్రదేశంలో మూడు నెలల కాలం పాటు ఉంచుతారు. అనంతరం మొక్కలను బయటకు తీసి నాణ్యమైన మొక్కలను గ్రేడింగ్ చేసి మరో 9 నెలల పాటు సెకండరీ నర్సరీ కేంద్రంగా పెంచుతారు. ఈ సమయంలో ఏడు నెలల తర్వాత మరోసారి మొక్కలను గ్రేడింగ్ చేసి నాణ్యమైన మొక్కలను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు.

  అంతేకాక రైతులకు ఇచ్చే సమయంలో కూడా నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుందని కేంద్రీయ ఆయిల్ ఫామ్ నర్సరీ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ నర్సరీ నిర్వహణ పూర్తిగా వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణ నిర్వహిస్తుండం విశేషం. ఒక ఎకరాకు 50 నుంచి 54 మొక్కల సామర్థ్యంతో రైతులకు కేవలం రూ. 20 రూపాయలకే మొక్కను అందిస్తున్నారు. మొక్క ఖరీదు రూ. 193లు ఉండగా.. రైతులు రూ. 20 చెల్లించగా ప్రభుత్వం రూ. 173 రూపాయలను సబ్సిడీగా అందిస్తుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Farming, Khammam, Local News

  ఉత్తమ కథలు