హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : గవర్నర్‌ తమిళిసైకి భద్రాద్రి జిల్లాలో చేదుఅనుభవం.. నిరసన తెలిపిన వరద బాధితులు

Telangana : గవర్నర్‌ తమిళిసైకి భద్రాద్రి జిల్లాలో చేదుఅనుభవం.. నిరసన తెలిపిన వరద బాధితులు

Governor Tamilisai

Governor Tamilisai

Telangana : వరద బాధితుల్ని పరామర్శించేందుకు భద్రాద్రి జిల్లాకు వెళ్లిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ఊహించని పరిణామం ఎదురైంది. వరద నష్టంపై అధికారుల్ని వివరాలు కోరడంతో ..వరద బాధితులు మేడమ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అశ్వాపురంలో మహిళలు తమను కలవకుండా అధికారులతో మాత్రమే మాట్లాడితే సరిపోతుందా అని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Tamilisai Soundararajan)గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడం రాజకీయమని టీఆర్ఎస్‌(TRS) ఆరోపిస్తుంటే ..మరోవైపు మేడమ్ తమిళిసైకు వరద బాధితుల నుంచే నిరసన సెగ తగిలింది. వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒకే సమయంలో తెలంగాణ సీఎం(Telangana CM) కేసీఆర్(KCR), గవర్నర్ తమిళిసై భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్‌ వరంగల్ (Warangal) మీదుగా ములుగు (Mulugu)జిల్లాలోని ఏటూరునాగారం (Ethurunagaram), రామన్నగూడెం(Ramannagudem) ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే ..గవర్నర్ తమిళిసై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే గవర్నర్‌ టూర్‌ని అధికార పార్టీ టీఆర్ఎస్‌ నేతలు తప్పుపడుతుంటే...వరద బాధితులు మాత్రం తమిళిసై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ పర్యటనలో ఉండగానే ఆమె ముందే తమ నిరసన తెలియజేశారు.

Telangana Rains: వర్షాల వెనక విదేశీ కుట్ర ఉందా? ఈ శతాబ్ధపు పెద్ద జోక్ ఇదే.. బండి కౌంటర్మేడమ్‌కు నిరసన సెగ..

గవర్నర్ తమిళిసైకు ఊహించని పరిణామం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేడమ్ పర్యటించారు. వరదలో పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి వరద బాధితులకు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇందులో భాగంగానే అశ్వాపురం ఎస్‌కేటీ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యవసరాలతో పాటు దుప్పట్లు, హెల్త్‌ కిట్లను పంపిణి చేశారు. పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద భాధితులు, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు, హెల్త్‌ కిట్స్ అందజేశారు. వరద నష్టం, సహాయకచర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుకున్నారు తమిళిసై. గవర్నర్‌ తీరుపై నిరసన వ్యక్తం చేశారు వరద బాధితులు. తమను కలవకుండా కేవలం అధికారులతో మాత్రమే మాట్లాడటం ఏమిటని ఆందోళనకు దిగారు. మహిళలు అరుపులు, కేకలతో నిరసనలు కొనసాగిస్తుండగానే తమిళిసై గెస్ట్‌ హౌస్‌కు వెళ్లిపోయారు.

అసహనం వ్యక్తం చేసిన వరద బాధితులు..

అంతకు ముందు పాములపల్లి గ్రామాన్ని సందర్శించారు గవర్నర్. భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అలాగే చింత్రియాల గ్రామాన్ని సందర్శించారు. వరద బాధితుల ఇళ్లను పరిశీలించారు. వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హెడ్‌డబ్లూపీఎం కాలనీలో నిత్యావసరాలు, మెడికల్ కిట్లు అందజేశారు. వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గవర్నర్.

Cloudburst: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? కృత్రిమ వర్షం సాధ్యమేనా? భారత్‌లో వరదల వెనక చైనా కుట్ర ఉందా?ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకొని మరీ...

వాస్తవానికి గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. రాష్ట్రపతి కోవింద్‌ పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వీడ్కోలు విందులో పాల్గొనాలి. భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల దీనస్థితిని చూసి చలించిన గవర్నర్‌ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని కొత్తగూడెం జిల్లాకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విషయాన్ని రాష్ట్రపతికి ఫోన్‌ ద్వారా తెలియపరిచారు. తాను అత్యవసరంగా కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నప్పటికి వరద బాధితుల నుంచి ఈతరహా నిరసనలు వ్యక్తమవడం చర్చనీయాంశంగా మారాయి.

Published by:Siva Nanduri
First published:

Tags: Godavari floods, Governor Tamilisai Soundararajan, Telangana News

ఉత్తమ కథలు