హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Rains: ఆ జిల్లాపై పగబట్టిన వరణుడు.., వణికిపోతున్న జనం.. మునిగిన పంటలు

TS Rains: ఆ జిల్లాపై పగబట్టిన వరణుడు.., వణికిపోతున్న జనం.. మునిగిన పంటలు

భద్రాద్రి జిల్లాను ముంచెత్తుతున్న వానలు

భద్రాద్రి జిల్లాను ముంచెత్తుతున్న వానలు

తెలంగాణ (Telangana) ను వరుణుడు వదిలేలా లేడు. నెల క్రితం ముంచెత్తిన వానలు మరోసారి దంచికొడుతన్నాయి. భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  తెలంగాణ (Telangana) ను వరుణుడు వదిలేలా లేడు. నెల క్రితం ముంచెత్తిన వానలు మరోసారి దంచికొడుతన్నాయి. భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం కాగా వాగులు, వంకల్లో వరద నీటి ప్రవాహం పెరిగింది. గురువారం సాయంత్రం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అత్యధికంగా 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మణుగూరులో అత్యల్పంగా 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇదే కాదు గత మూడు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

  జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో నమోదైన వర్షపాతం వివరాలు..

  పాల్వంచ మండలం సీతారామ పట్టణంలో 27.3మీమీ, ఆళ్లపల్లిలో 26.3మీమీ, టేకుపల్లిలో 24.5మీమీ, దమ్మపేట మండలం నాయుడుపేటలో 23.5మీమీ, మందలపల్లి లో 23మీమీ, జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 20మీమీ, చుంచుపల్లి మండలం తిరుమలపాడులో 18మీమీ, అశ్వాపురం 16.5మీమీ, గుండాల 16.5మీమీ, లక్ష్మీదేవి పల్లి 16మీమీ, జూలూరుపాడు 14.8మీమీ, అన్నపురెడ్డిపల్లి మండలం పెండ్యాలలో 14.3మీమీ, అశ్వరావుపేట 11.5మీమీ, ములకలపల్లి 9.8మీమీ, కరకగూడెం 9.3మీమీ, సుజాతనగర్ 7.5మీమీ, చండ్రుగొండ మండలం వద్ద ముదుకూరులో 5.8మీమీ, బూర్గంపాడులో 2మీమీ, పినపాక మండలం బయ్యారంలో 1.5 మిల్లీమీటర్లగా వర్షపాతం నమోదయింది.

  ఇది చదవండి: రొయ్య.. ఈ జిల్లాలో కొరకరాని కొయ్య.. తలసాని సార్ జర సూడుర్రి

  భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో జలకళ సంతరించుకుంది. చర్ల మండలంలోని తాలుపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 7 గేట్లను ఎత్తి 9,230 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ రెండో వారం వచ్చినా వర్షాలు కురుస్తుండడంతో సేద్యం చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  ముఖ్యంగా వరి, పత్తి సాగుచేసే రైతులు పంట సాగులో క్రిమిసంహారక మందులను పిచికారి చేయడానికి వర్షం ఆటంకంగా మారుతుంది. అంతేకాక విస్తారమైన వర్షాల కారణంగా కలుపు కూడా అదే స్థాయిలో పెరుగుతుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న తరుణంలో జిల్లా రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు