హోమ్ /వార్తలు /తెలంగాణ /

మహిళా ఉద్యోగికి బీఆర్ఎస్ నేత ఫోన్.. కాసేపటికే నిద్రమాత్రలు మింగి..

మహిళా ఉద్యోగికి బీఆర్ఎస్ నేత ఫోన్.. కాసేపటికే నిద్రమాత్రలు మింగి..

X
బీఆర్ఎస్

బీఆర్ఎస్ నేత కారణంగా దేవాదాయ శాఖ అధికారిణి ఆత్మహత్యాయత్నం

Shocking: అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాలని మనస్థాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ప్రస్తుతం కలలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Khammam | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాలని మనస్థాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ప్రస్తుతం కలలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District) దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్(పర్యవేక్షకురాలు) రెంటాల సమత ఉదయం అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈమేరకు ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిన కారణాలను ఖమ్మంలోని కార్యాలయం వద్ద ఆమె మంగళవారం వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మ గుడి ట్రస్ట్ బోర్డ్ విషయమై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు ఫోన్ చేసి దుర్భాషలాడారని ఆరోపించారు.

కమిటీ వేయొచ్చా అని ఆరా తీయగా.. రెండు నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తులు రాలేదని తాను చెప్పినట్లు వెల్లడించారు. అయితే, 'విషయం నాకు చెప్పాలి కదా.. గోడలకు నోటీసులు అంటిస్తే ఎవరు చూస్తారు.. మాకు చెప్పకుండా సీక్రెట్ గా చేస్తే ఎలా' అని వేణు ప్రశ్నించారని.. రహస్యమేమీ లేదని చెబుతుండగానే చెప్పాల్సిన బాధ్యత మీదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయారు. తనను కసురుకోవద్దని వివరించే ప్రయత్నం చేసినట్లు సమత తెలిపారు. అయినా ఆడకూతురినని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడంతో భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని మాత్రలు(బీపీ, న్యూరో) వేసుకున్నానని తెలిపారు. అయితే, అప్పటికే సమత మాత్రలు మింగివచ్చినట్లు తెలియడంతో దేవాదాయ శాఖ ఉద్యోగులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇది చదవండి: బ్రాండెడ్ కంపెనీల ఆఫర్లు.. జనరిక్ మందుల జాడేది..?

ఆతర్వాత కలె క్టర్ గౌతమ్, దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏ.సులోచన, టీఎన్జీవోస్ ప్రతినిధులు ఆమెను పరామర్శించారు. అలాగే, ఉద్యోగులకు రక్షణ కల్పించాలనే డిమాండ్ తో టీఎన్జీవోస్ నాయకులు ఆందోళన చేపట్టారు.ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షుడు బెల్లం వేణుపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగి సమతను వేధించగా ఆమె మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో బెల్లం వేణు మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమ తను తాను దుర్భాషలాడలేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణు తెలిపారు. మారెమ్మతల్లి ఆలయ కమిటీ విషయమై ఈఓతో మాట్లాడితే నోటిఫికేషన్ రాలేదని చెప్పడంతో ఇన్ స్పెక్టర్తో మాట్లాడానని చెప్పారు. అయితే, రెండు నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామని ఆమె బదులివ్వగా, 'ఇదేందమ్మా నోటిఫికేషన్ గురించి మాకెందుకు చెప్పలేదు, కనీసం మాకు సమాచారం ఇస్తే బాగుండేదమ్మా.. మీకు చెప్పే బాధ్యత ఉంది కదా' అని అడిగానే తప్ప దుర్భాషలాడలేదని తెలిపారు. మండలంలో ఆదాయం మెరుగ్గా ఉన్న ఆలయాలకు కమిటీలకు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్న ఇన్స్పెక్టర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

First published:

Tags: Bhadrachalam, Khammam, Local News, Telangana

ఉత్తమ కథలు