హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mystery: హాస్టల్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం .. నరబలి కోసం అంతకు తెగించారా..!

Mystery: హాస్టల్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం .. నరబలి కోసం అంతకు తెగించారా..!

KHAMMAM GIRL KIDNAP

KHAMMAM GIRL KIDNAP

Mystery: హాస్టల్‌లో చదువుతున్న బాలిక షడన్‌గా కనిపించకుండా పోయింది. రెండో రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదే హాస్టల్లో పై అంతస్తులోని గదిలో బల్ల కింద ఉండటం అందర్ని షాక్‌కి గురి చేసింది. అసలు ఎందుకు ఎత్తుకెళ్లారు..? ఆమెను ఏం చేయాలనుకున్నారో..? తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G.SrinivasReddy,News18,Khammam)

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem)జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ  బాలికల పాఠశాల విద్యార్థిని మేఘన అదృశ్యమైన వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కనిపించకుండా పోయిన బాలిక అనూహ్యంగా రెండో రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలోఅదే హాస్టల్లో(Hostels)ని పై అంతస్తు భవనంలోని ఓ గదిలో బల్ల కింద ఉండటం అందర్ని షాక్‌కి గురి చేసింది. చిన్నారి ఆచూకి దొరికిందని ఊపిరి పీల్చుకున్న అధికారులకు చిన్నారి మేఘన(Meghna)చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొట్టింది.

కిడ్నాప్ వెనుక అసలు కథ..

చిన్నారి మేఘనను వైద్య పరీక్షల అనంతరం ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. అదే సమయంలో చిన్నారిని ఏమైందని అడిగి ప్రశ్నకు మేఘన చెప్పిన విషయాలు అందర్ని షాక్‌కు గురి చేశాయి. ఆమె స్వయంగా మాట్లాడిన విషయాన్ని రికార్డింగ్ చేశారు. ఆ ఆడియో టేపులే రెండు రోజుల నుండి పలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదే విషయమై స్వయంగా ఆదివారం బూర్గంపహడ్    మండల కేంద్రంలోని స్థానిక  మార్కెట్ యార్డులో ఎన్డీ ప్రజాపంతా పార్టీ పీడీఎస్‌యు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

KTR|Viral news : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం .. మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

నరబలి కోసమేనా..?

ఆ సమావేశంలో మేఘన కోయ భాషలో మాట్లాడింది. తనను ఎవరో నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఓ దుకాణం దగ్గరకు తీసుకుపోయి బిస్కెట్ ప్యాకెట్లు కొనిచ్చి నోటికి గుడ్డకట్టి  సంచిలో వేసుకొని దూరంగా తీసుకుపోయారంది. తెల్లవారు జాము సమయంలో మళ్ళీ నన్ను గోడ వెనుక నుండి నన్ను తీసుకొచ్చి పాఠశాల పైన ఉన్న గదిలోని బల్లా క్రింద నెట్టి పెట్టారని, ఆ నలుగురికి సహకారం అందించింది మా పాఠశాలలో పని చేసే వంట కుక్, నైట్ వాచ్‌మెన్ కాంతమ్మ ఆంటీనే అని బహటంగానే ఆరోపించింది ఆ చిన్నారి.

మేఘన కేసులో కొనసాగుతున్న మిస్టరీ ..

నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కుక్ కాంతమ్మ సహకారంతో చిన్నారి మేఘనను కిడ్నాప్ చేశారని తెలిసి జిల్లా యంత్రాంగం ఉలిక్కి పడింది. విషయం తెలిసే కిడ్నాపర్లు చిన్నారిని మరలా తీసుకు వచ్చి పాఠశాలలో దాచిపెట్టడం జరిగిందని పీడీఎస్‌యు స్టూడెంట్ యూనియన్, సి.పి.ఐ,ఎం.ఐ ప్రజా పంథా నాయకులు అంటున్నారు. దీనికి ఆశ్రమ పాటశాల సిబ్బంది పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది అని  ఆరోపించారు. అమాయకురాలైన 3వ తరగతి విద్యార్థిని మేఘన నోరు మూసి కాళ్ళు,చేతులు కట్టేసి సంచిలో వేసుకొని వెళ్లి పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేశారని విద్యార్థిని చెబుతున్న క్రమంలో తమకు అదే అనుమానం కలుగుతుందని వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగులపై వేటు ..

ఇప్పటికే వార్డెన్‌తో పాటు ఐటీడీయే పిఓను సస్పెండ్ చేశారని అదే విధంగా హెచ్.ఎంను వాచ్‌మెన్‌ కాంతమ్మను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంలో నరబలి కోసమే చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మేఘన కిడ్నాప్‌ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాల్వంచ సీఐ నాగరాజు గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించి 40 నుంచి 50 మంది విద్యార్థులను సిబ్బందిని విచారించామని ఆయన తెలియజేశారు. హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ వార్డెన్ బి.సునీతను సస్పెండ్ చేస్తూ ఐ టి డి ఎ పి ఓ  గౌతం అదేశాలు జారీ చేశారు. పీజీహెచ్‌ఎం సామ్రాజ్యంకు షో కాజ్ నోటీసు జారీ చేశారు.

First published:

Tags: Bhadradri kothagudem, Minor girl kidnaped, Telangana crime news

ఉత్తమ కథలు