హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. పూజలు, టికెట్ల వివరాలివే..!

Bhadradri: సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. పూజలు, టికెట్ల వివరాలివే..!

భద్రాచలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

భద్రాచలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Bhadrachalam: దేవీ శరన్నవరాత్రులంటూ హిందువులు ఎంతో నిష్ఠనియమాలతో జరుపుకునే పండుగ దసరా. దసరా వచ్చిందంటే దేశ వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అన్ని ఆలయాల, పుణ్యక్షేత్రాలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో కళకళలాడుతుంటాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భక్తులు కోరే కోరికలను నెరవేర్చడానికి ఆ ఆదిపరాశక్తి ఎనిమిది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. వాటినే అష్టలక్ష్మీ అలంకారాలని పిలుస్తారు. ఈ ఎనిమిది రకాల అలంకారాల్లో అమ్మవారిని కొలిస్తే అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు, విద్య , ధైర్యం, సంతానం, విజయం తదితర మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దేవీ శరన్నవరాత్రులంటూ హిందువులు ఎంతో నిష్ఠనియమాలతో జరుపుకునే పండుగ దసరా. దసరా వచ్చిందంటే దేశ వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అన్ని ఆలయాల, పుణ్యక్షేత్రాలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో కళకళలాడుతుంటాయి. సుప్రసిద్ధ రామక్షేత్రమైన భద్రాచలంలోనూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను దేవస్థానం అధికారులు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాక్షాత్తు స్వామి వారే అమ్మవారి చెంతకు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్తుల నమ్మకం.

  ఇందులో భాగంగానే దర్బారు సేవను ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి ఎదురుగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి నిర్వహిస్తుండటం విశేషం. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలు పాంచరాత్రగమ శాస్త్రానికి అనుగుణంగా వీరలక్ష్మి ఉత్సవాలుగా భక్త రామదాసు కాలం నాటి నుంచి కొనసాగుతున్నాయి. కాలక్రమేణా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేయాలనే సంకల్పం 1973-74లో చోటు చేసుకొంది.

  ఇది చదవండి: రాజరాజేశ్వరీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత ఘట్టం.. చూటడానికి రెండు కళ్లు చాలవు.!

  దీంతో నాటి నుంచి నేటి వరకు ఏటా ఆశ్వీజమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది . గత 49 ఏళ్లుగా భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విజయవాడలో కనకదుర్గ దేవస్థానంలో నిర్వహిస్తున్న మాదిరిగానే భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

  ఇది చదవండి: నిర్మాణం పూర్తైన ప్రారంభోత్సవానికి నోచుకోని కలెక్టరేట్ .. కారణం ఆ పెద్దసారే..!

  విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవాల మాదిరిగానే భద్రాచలంలో నిర్వహించే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో రామాయణ పారాయణం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం ఆలయంలో స్వామి వారికి రామాయణ పారాయణం నిర్వహించడం ఇక్కడ పరిపాటి అయినప్పటికీ మిగిలిన రోజుల్లో రామునిపరంగా ఆచరిస్తే శరన్నవరాత్రుల్లో 'సీతాయః చరితం మహత్' అని రామాయణంలో అన్నట్లుగా అమ్మవారి పరంగా శరన్ననవరాత్రుల్లో రామాయణ పారాయణం చేయడం విశేషం.

  ఇది చదవండి: ఆ జిల్లాలో రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పామాయిల్: దేశానికే ఆదర్శంగా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ

  అయితే శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో తొమ్మిది రోజుల పాటు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరాకాండ, యుద్ధకాండలను భక్తి ప్రపపత్తులతో తప్పనిసరిగా పఠిస్తారు. పుష్యమి నాడు స్వామి వారికి ఏ విధంగా పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుందో అలాగే భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో రామాయణ పారాయణం పూర్తి చేసిన అనంతరం విజయదశమి నాడు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

  ఇది చదవండి: తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ కళాశాల: ఎక్కడుందో తెలుసా?

  ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధికారులు ఈ నెల 26 నుంచి ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారికి పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉత్సవాలు జరిగే సమయంలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారి సన్నిధిలో అభిషేకం, రామాలయంలో ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు సామూహిక శ్రీరామాయణ పారాయణం ( చిత్రకూటమండపంలో ) సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు సామూహిక కుంకుమార్చన, 5.30 నుంచి 7.30 వరకు విశేష దర్బారు సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాదగోష్టి, 7 నుంచి 8.30 వరకు శ్రీరామాయణ ప్రవచనం జరగనున్నాయి.

  అంతేకాక శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవాలు జరిగే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరువీధి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించేలా దేవస్థానం అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో పూజలు సేవలకు సంబంధించిన టిక్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ లక్ష్మి అమ్మవారి అభిషేకం రూ. 100, సామూహిక కుంకుమార్చన రూ.500, శ్రీరామాయణ పారాయణం రూ.1000, అమ్మవారి విశేష అలంకారం రూ.1000, శాశ్వత ఉభయం రూ.10 వేలు ఉంటుంది. మిగిలిన వివరాలకు దేవస్థానం కార్యాలయ పనివేళల్లో ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం సమాచార కేంద్రం నెంబర్.7660007672, దేవస్థానం సూపర్డెంట్ 9705192935. నెంబర్లలో సంప్రదించవచ్చు అని అధికారులు తెలియజేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు