హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: భద్రాద్రిలో శ్రీరామాయణ ఉత్సాహంగా మహా పారాయణం.., కొద్ది మందికే అవకాశం

Bhadradri: భద్రాద్రిలో శ్రీరామాయణ ఉత్సాహంగా మహా పారాయణం.., కొద్ది మందికే అవకాశం

భద్రాచలంలో

భద్రాచలంలో ఆకట్టుకున్న రామాయణ పారాయణం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాంచరాత్ర ఆగమన శాస్త్రానికి అనుగుణంగా అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ జరగడం ఆనవాతీ.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాంచరాత్ర ఆగమన శాస్త్రానికి అనుగుణంగా అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ జరగడం ఆనవాయితీ. భక్త రామదాసు కాలం నుంచి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడి పండితులు చెబుతున్నారు. కాలక్రమేణా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేయాలనే సంకల్పంతో 1973-74 సంవత్సరం నుండి ప్రతి ఏటా ఆశ్వీజ మాసంలో శుక్లపక్షపాజ్యం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత 49 ఏళ్లగా భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుండగా ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా భక్తులే పాల్గొని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

  ఇందులో భాగంగానే శ్రీ రామాయణ మహా పారాయణ కార్యక్రమం జరగడం విశేషం. నిజానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామాయణ పారాయణం ప్రతిరోజు జరిగే నిత్య కృత్యమే‌ అయినప్పటికీ మిగిలిన రోజుల్లో రామాయణ పారాయణం రాముని పరంగా ఆచరిస్తే శరన్నవరాత్రి ఉత్సవాలలో మాత్రమే 'సీతాయః చరితం మహత్' అని రామాయణంలో అన్నట్లుగా అమ్మవారి పరంగా శ్రీరామాయణ పారాయణం చేయడం విశేషం. శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఇలా సంపూర్ణ రామాయణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా పఠిస్తుంటారు. ఈ మహా యజ్ఞానికి భక్తులకు సైతం భాగస్వామ్యం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న భక్తులందరికీ శ్రీ రామాయణ మహా పారాయణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.

  ఇది చదవండి: అవినీతి ఆరోపణలున్న అధికారి ఈఓగా నియామకం.., ఆ ఆలయంలో ఏం జరుగుతోంది..?

  ఈ ఏడాది భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో చిత్రకూట మండపం నందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది భక్తులు రామాయణ పారాయణం చేసేందుకు వచ్చారు. వీరికి అక్కడే ఉచిత వసతి, భోజనం, ప్రతి రోజు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఈ మహా యజ్ఞంలో పాల్గొనే సదవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆసక్తి గల 108 మంది భక్తులు స్వచ్ఛందంగా ఈ మహా రామాయణ పారాయణంలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దేవస్థానం ఆవరణలో ఉన్న చిత్రకూట మండపం నందు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ సమయంలోనే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దేవస్థానార్చకులు. ఈ శ్రీరామాయణ పారాయణం చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని, ఈ పారాయణంలో పాల్గొనే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadrachalam, Local News, Telangana

  ఉత్తమ కథలు