(D Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందిన ఘటన భద్రాచలం (Bhadrachalam) పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అశోక్ నగర్ కాలనీకి చెందిన నగటి రాధామణి (22) గర్భిణి. కాగా, సెప్టెంబర్ 18న ప్రసవానికి తేదీ ఇచ్చారు. అయితే , శుక్రవారం నొప్పులతో బాధపడుతున్న రాధామణిని కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) తరలించారు. కాగా, రాధామణి.. సికిల్‌సెల్ ఎనీమియా అనే వ్యాధితో బాధపడుతుండడం, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఫిజీషియన్ లేకపోవడంతో లేకపోవడంతో కొత్తగూడెంలోని (Kothagudem) మాతాశిశు ఆస్పత్రికి రిఫర్ చేశారు. కానీ బంధువులు కొత్తగూడెం తీసుకెళ్లకుండా మధ్యాహ్నం 3:20 గంటల సమయంలో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే కడుపులో బిడ్డ మృతి చెందినట్లు గుర్తించిన వైద్యులు మృత శిశువును బయటకు తీసేందుకు ఆపరేషన్ (Operation) ప్రారంభించారు.
ఈక్రమంలో తీవ్ర రక్తస్రావం కాగా రాత్రి 10:30 గంటల సమయంలో రాధామణి కూడా మృతి చెందింది (Radhamani Died). ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు అర్ధరాత్రి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ, పట్టణ సి.ఐ నాగరాజు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో తమ బిడ్డకు వైద్యం చేసుంటే ఈ గతి పట్టేది కాదని బంధువులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో ఫీజిషియన్ పోస్టు ఖాళీగా ఉండగా భర్తీ చేయడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏసీబీ సోదాలతో ఉలిక్కిపడ్డ గ్రామం:
భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటనలో అతని స్వగ్రామంలోనూ ఏసీబీ దాడులు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ నరేష్.. భూపాలపల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
Hyderabad : కాబోయే లేడీ పోలీస్ కానిస్టేబుల్‌కి సీఐ హెల్ప్ .. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే
ఈక్రమంలో ఓ వ్యాపారి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఎస్ఐస్వగ్రామం మంగయ్యబంజర్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు నరేష్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఎస్ఐ నరేష్ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు పలు వివరాలు సేకరించారు. కాగా, మారుమూల గ్రామమైన మంగయ్యబంజర్‌లో ఏసీబీ దాడులు నిర్వహించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Crime news, Hospitals, Local News