హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇది పశువుల కొట్టం కాదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఈ మేకల మంద కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి

ఇది పశువుల కొట్టం కాదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఈ మేకల మంద కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి

భద్రాచలంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆవాసంగా మార్చుకున్న పశువులు, మేకలు

భద్రాచలంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆవాసంగా మార్చుకున్న పశువులు, మేకలు

ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు సరిపోవంటూ కాంట్రాక్టర్లు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. దీంతో అవి అటూ ఇటూ కాకుండా ఆగిపోయాయి. పశువులు, మేకల మందలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇదంతా భద్రాచలంలో జరుగుతున్న వ్యవహారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Mahabubabad | Vijayawada | Khammam

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు సొంత ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ పథకం ద్వారానే ప్రజల నుంచి ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా భద్రాద్రి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 2016 పక్కా ఇళ్లను మంజూరు చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వరద బాధితులకు పక్కా ఇళ్లతో పాటుగా సుమారు 7,274 మంది వరద బాధితులకు, కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది.

సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేయడంతో పాటు పధకాల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. భద్రాచలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అయితే గత కొన్నేళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నేడు శిధిలావస్థకు చేరుకున్నాయి. నిర్మాణ దశలోనే అర్ధాంతరంగా ఆగిపోయి ప్రస్తుతం పశువుల ఆవాసంగా మారాయి భద్రాచలం పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. దీంతో ప్రభుత్వ తీరుపై గత కొన్నిరోజులుగా భద్రాచలం వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి ? ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఎందుకు ఆ ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి? ప్రారంభం కాకుండానే శివిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దుస్థితికి కారుకులెవరు?

Also Read: Wife and Husband: పెళ్లినాటి ప్రమాణాలను ఈ భార్య ఎలా నిజం చేసిందో చూడండి.. అందుకే పోలీసులు పట్టుకున్నారు..



2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ప్రారంభించగా, భద్రాచలం ఐటిడిఏ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలని నిర్ణయించింది.‌ ఇప్పటి వరకు 7503 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేయగా అందులో 3276 అసంపూర్తిగానే వివిధ స్థాయిల్లో ఆగిపోయాయి. మిగిలిన 4227 ఇళ్లకు గానూ 1091 ఇళ్ల నిర్మాణ పనులే ప్రారంభించలేదు. 447 ఇళ్ల నిర్మాణాల విషయమై ఇంకా టెండర్ స్థాయిలోనే ఉండగా 1809 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ప్రారంభించి 8 సంవత్సరాలు గడుస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుకున్న లక్ష్యాలు చేరుకోలేదని చెప్పుకోవచ్చు.

ఇతర ప్రాంతాల్లో... కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత, సరైన సమయంలో సంబంధిత నిర్మాణాలకు బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం, ఇలా పలు కారణాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోగా భద్రాచలం పట్టణంలో మాత్రం ఇందుకు భిన్నమైన కారణంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయినట్లు తెలుస్తుంది. సంబంధిత శాఖ అధికారులు 120 గృహాలను ఇండివిడ్యువల్ హౌస్‌గా డబుల్ బెడ్ రూంలను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలవగా, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొని టెండర్లు దక్కించుకున్నారు. కానీ భద్రాచలంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో అపార్ట్మెంట్ మోడల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇండివిడ్యువల్ మోడల్ హౌస్‌కు మంజూరైన సొమ్ము అపార్ట్మెంట్ మోడల్‌లో నిర్మించేందుకు సరిపోవటం లేదనే కారణంతో సదరు కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేసినట్లు తెలుస్తుంది.

Also Read : భావితరాలకు వేద నాదం వినిపించేలా చిన్ననాటి నుంచే వేదాభ్యాసం.., అంబా వేద పాఠశాల


ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని రాజీవ్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న 120 డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో పశువులకు నిలయంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. అంతేకాక ప్రారంభం కాకుండా కొన్నిచోట్ల ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని గుర్తించి ప్రజా సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా జిల్లా కలెక్టర్ అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేయడంతో త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయనే వార్త కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

First published:

Tags: Bhadradri kothagudem, Bhadrari kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు