హోమ్ /వార్తలు /తెలంగాణ /

Viral news: ఘనంగా కుక్క పుట్టిన రోజు వేడుకలు .. ఏ రేంజ్‌లో చేశారో ఈ వీడియో చూడండి

Viral news: ఘనంగా కుక్క పుట్టిన రోజు వేడుకలు .. ఏ రేంజ్‌లో చేశారో ఈ వీడియో చూడండి

DOG BIRTHDAY

DOG BIRTHDAY

Viral news:పెంపుడు కుక్కపై ఓ ఫ్యామిలీ మమకారం పెంచుకుంది. బిడ్డల కంటే ప్రేమగా దాన్ని చూసుకుంటున్నారు. చివరకు పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసి భోజనాలు కూడా పెట్టారంటే ఆ శునకం ఎంత భాగ్యం చేసుకుందో ఊహించండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G.SrinivasReddy,News18,Khammam)

పిల్లల పుట్టిన రోజులు ఘనంగా జరుపుకోవడం చూశాం. లేదంటే చనిపోయిన వాళ్ల బర్త్‌ డే వేడుకలు నిర్వహించడం విన్నాం. కాని పెంపుడు కుక్క (Pet dog)జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri kothagudem)జిల్లా అలాంటి అరుదైన సంఘటనకు వేదికైంది. విశ్వాసం చూపించడంలో మనిషి కంటే కుక్కే(Dog) బెటర్ అని అందరూ భావిస్తారు. అందుకే పెంపుడు కుక్కపై ఓ ఫ్యామిలీ మమకారం పెంచుకుంది. బిడ్డల కంటే ప్రేమగా దాన్ని చూసుకుంటున్నారు. చివరకు (Birthday)పుట్టిన రోజు సందర్బంగా కేక్ (Cake)కట్ చేసి భోజనాలు కూడా పెట్టారంటే ఆ శునకం ఎంత భాగ్యం చేసుకుందో ఊహించండి.

Telangana Politics: తెలంగాణ బీజేపీ నుంచి మరొకరు ఔట్ .. టీఆర్ఎస్‌లోకి రాపోలు ఆనంద భాస్కర్‌..?

గ్రాండ్‌గా డాబ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకను దాని యజమాని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఓఎన్జిసి రిటైర్డ్ ఉద్యోగి మోటపర్తి వీరయ్య చౌదరి,  రత్నకుమారి దంపతులు మిల్కీ అనే పమెరియన్ డాగ్ ను పెంచుకుంటున్నారు. ఈ పెంపుడు కుక్క అంటే వారికి ఎనలేని ప్రేమ.. మిల్కీని వారి కుటుంబ సభ్యురాలిలా చూసుకుంటారు. పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని డిజైనర్ ద్వారా ప్రత్యేక పార్టీ వేర్ బర్త్ డే డ్రస్సు మిల్కీకి వేసి.. బంధువులను మిత్రులను పిలిచి అట్టహాసంగా కేక్ కటింగ్ నిర్వహించారు.

అతిథులకు విందు ఏర్పాటు...

అనంతరం రకరకాల వంటకాలతో అందరికి భారీ విందును ఏర్పాటు చేసి పెంపుడు కుక్కపై వారికున్న ప్రేమను చాటుకున్నారు. ప్రతి ఏడాది మిల్కీ పుట్టినరోజున ఇదే విధంగా సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు వీరయ్యచౌదరి దంపతులు. మిల్కీ పుట్టిన రోజు నాడు కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వాళ్లను పిలిపించి కేక్ కట్ చేయిస్తున్నారు. మిల్కీ నీ ఆశీర్వదించాలని కోరడం వీరికి పరిపాటే అయ్యింది. కొంతమందికి ఇది వింతలా అనిపించిన కుక్కలను పెంచుకునే వారికి మాత్రం.. వాటితో ఉండే అనుబంధం ప్రత్యేకమని చెప్పాలి.

హర్షిస్తున్న జంతు ప్రేమికులు..

విశ్వాసం సంగతి పక్కన పెడితే రక్తం పంచుకు పుట్టిన వాళ్లపైనే కనికరం చూపని ఈరోజుల్లో ..కన్నవాళ్లను గాలికి వదిలేసి చేతులు దులుపుకుంటున్న ప్రస్తుత కాలంలో పెంచుకుంటున్న కుక్కను సొంత బిడ్డలా చూసుకుంటూ దానికి పుట్టిన రోజు వేడుకను ఇంత ఘనంగా చేస్తుండం పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Dog, Telangana News

ఉత్తమ కథలు