హోమ్ /వార్తలు /తెలంగాణ /

సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం విశిష్టత ఏంటో తెలుసా?!..

సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం విశిష్టత ఏంటో తెలుసా?!..

X
స్వామివారికి

స్వామివారికి పుష్కర పట్టాభిషేకం..

Telangana: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలలో ప్రధాన క్రతువులైన స్వామి వారి కళ్యాణం మార్చి 30వ తేదీన జరగనుండగా మరుసటి రోజు స్వామివారికి మహా సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం జరగనుంది.‌ అయితే ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలలో మహా సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం పేరుతో స్వామివారికి జరిగే పూజా కార్యక్రమానికి ప్రత్యేక విశిష్టత ఉంది.‌

భద్రాద్రి రాముల వారి ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి మరుసటి రోజు స్వామివారికి మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న అంశం.‌ ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తూ వస్తుంటారు. ఇదే పట్టాభిషేకాన్ని శ్రీరామనవమి కళ్యాణం అనంతరం మహా పట్టాభిషేకంగా ప్రతి 12 నెలలకు ఒకసారి సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకంగా ప్రతి 60 ఏళ్లకు ఓసారి మహా సామ్రాజ్యం పుష్కర పట్టాభిషేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఈ జగతిలో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మాత్రమే జరిగే ఈ పట్టాభిషేక క్రతువు గురించి భద్రాద్రి దేవస్థానం స్థానాచార్యులు స్థల సాయి న్యూస్ 18 కు వివరించారు. ఇదిలా ఉండగాదేవదేవుడైన భద్రాచలం రామయ్యకు సీతమ్మకు 30న జగత్కల్యాణం, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ క్రతువు నిమిత్తం చేసిన అంకురార్పణ అలరించింది.

కీర్తనలతో మాడవీధులు రామనామమయమై ప్రతిధ్వనించాయి. మూలవిరాట్ వద్ద ఉత్సవా నుజ్ఞ తీసుకున్నారు. విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం జరిపారు. రామాలయం నుంచి ఊరేగింపుగా తాతగుడి వద్దకు వెళ్లి సంప్రదాయ పద్ధతిలో పుట్టమట్టిని తవ్వి ప్రత్యేక పాత్రల్లో సేకరించారు. ఈ మట్టిని మూడు యాగశాలలకు చేర్చి అంకురార్పణ నిర్వహించారు.

ఇదిలా ఉండగాశ్రీరామనవమి ఉత్సవాల ప్రచార పత్రంతో పాటు ఆహ్వాన పత్రికల్లో 26న అంకురార్పణ అని పొందుపర్చారు. ఆరోజే పుట్ట మట్టి పూజ ఉంటుందని అందరూ భావించారు. గత వేడుకలను పరిగణనలోకి తీసుకున్నా ఇదే సరైనదని అనుకున్నారు. తీరా చూస్తే బుధవారమే అంకురార్పణ నిర్వహించారు. దీన్ని ఎవ్వరూ తప్పు పట్టకున్నా.. సమాచారాన్ని భక్తులకు ముందస్తుగా ప్రచారం చేయకుండా అయోమయం సృష్టించారు. పంచేష్టి వేడుకలపైనా ప్రచారం చేయాలి.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు