Kranthi Kumar, News 18, Bhadradri
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై పలువురు కౌన్సిలర్లు అసమ్మతి గళం విప్పారు. చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేస్తున్నారని విమర్శించారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని 15 మంది కౌన్సిలర్ల సంతకాలతో పదకొండు మంది కౌన్సిలర్లు కలెక్టరేట్ చేరుకున్న నేపథ్యంలో కలెక్టర్ ను కలిసేందుకు అధికారులు ఐదుగురిని మాత్రమే అనుమతించారు.
కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదు చెల్లదని, అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యపడదని కలెక్టర్ బదులిచ్చినట్లు సమాచారం. ఇల్లెందు పురపాలికలో 24 వార్డులుండగా 16 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్ కు వచ్చినా తమ సమస్య ఏంటో కలెక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, కనీసం దరఖాస్తు తీసుకోకుండా అగౌరపరిచారంటూ మహిళా కౌన్సిలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించారు.
Big News: ఎమ్మెల్యేల ఎర కేసు..ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా!
ఈ సందర్భంగా కౌన్సిలర్లు చీమల సుజాత, పత్తి స్వప్న, కొండపల్లి సరిత, రజిత, తోట లలిత శారద, కడగంచి పద్మ, సంద బింధు, సిలివేరు అనిత, పాబోలు స్వాతి, తార, కొక్కు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చైర్మన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అసమ్మతి కౌన్సిలర్లతో కొందరు సభ్యులు మూడు రోజులుగా మంతనాలు జరిపి, ఏకతాటిపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. నోటీస్ ఇచ్చాక క్యాంపునకు తరలివెళ్లినట్లు సమాచారం. అసమ్మతి తెలిపిన కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావు (3వ వార్డు), తోట లలిత శారద (6వ వార్డు), సామల మాధవి (7వ వార్డు), సిలివేరు అనిత(12వ వార్డు), కడకంచి పద్మ(13వ వార్డు), సందా బిందు(14వ వార్డు), గిన్నారపు రజిత (16వ వార్డు), పాబోలు స్వాతి(18వ వార్డు). పత్తి స్వప్న (19వ వార్డు), వాంకుడోతు తార (24వ వార్డు), చీమల సుజాత (15వార్డు), కొండపల్లి సరిత (21వ వార్డు) అవిశ్వాస పత్రంపై సంతకం చేసి, కొత్తగూడెం వెళ్లి కలెక్టర్లకునోటీసు ఇచ్చారు.
Telangana New Secretariat: సెక్రెటేరియేట్ లో జరిగింది ప్రమాదమా లేక నరబలా? హైకోర్టులో KA పాల్ పిల్
చెరుపల్లి శ్రీనివాస్ (11వార్డు), మొగిలి లక్ష్మి( 21వ వార్డు), కుమ్మరి రవీందర్ (23వ వార్డు) సంతకాలు చేసినప్పటికీ కొత్తగూడెం వెళ్లలేదు. కాగా ఇద్దరు సభ్యులు మొగిలి లక్ష్మి, కుమ్మరి రవీందర్లు తమకు అవిశ్వాస వ్యవహారంతో సంబంధం లేదని, తాము సంతకాలు చేయలేదని, అయినా తామ సంతకాలు చేసినట్లు ఉన్న పత్రం అందజేసి మనో వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకరు అధికార బీఆర్ఎస్ కాగా మరొకరు సిపిఐ అభ్యర్థిగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Telangana