హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇకపై తిరువీధి సేవలో స్వర్ణకృత వాహనాలపై రామయ్య దర్శనం!

ఇకపై తిరువీధి సేవలో స్వర్ణకృత వాహనాలపై రామయ్య దర్శనం!

X
భద్రాద్రి

భద్రాద్రి రామయ్యకు కొత్త వాహనాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం (Bhadrachalam Temple) ఖజానాకు నూతన సువర్ణ ద్వాదశ వాహనాలు చేరాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం (Bhadrachalam Temple) ఖజానాకు నూతన సువర్ణ ద్వాదశ వాహనాలు చేరాయి. ఈ వాహనాల తయారీకి ప్రవాసాంధ్ర ఆర్యవైశ్య అసోసియేషన్ రూ.75 లక్షల ఆర్థిక సాయం అందించింది. దీంతో దేవస్థాన వైదిక కమిటీ సలహాలు, సూచనల మేరకు తమిళనాడులోని కుంభకోణంలో నిష్ణాతులైన కళాకారులచే వాహనాలను తయారు చేయించారు. ఇందులో సార్వభౌమ, హనుమంత, కల్పవృక్ష, సింహాసన, హంస, సింహ, గజ, అశ్వ, చంద్రప్రభ, సూర్యప్రభ, గరుడ, శేష వాహనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా భద్రాద్రి దేవస్థానంలో భక్త రామదాసుగా కీర్తింపబడుతున్న శ్రీరామదాసు కాలంలో తయారు చేయించిన వాహనాలతోనే ఇప్పటివరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామి వారికి వాహన సేవలు అందుతున్నాయి.

తిరువీధి సేవలతో పాటు ప్రధాన ఉత్సవాలైన శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి వేడుకల్లో స్వామివార్ల వాహనసేవలు ఉంటాయి. ఈ క్రమంలో నూతనంగా తయారు చేయించిన సువర్ణద్వాదశ వాహనాలతో ఇక నుంచి స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా దేవస్థానంలోని చిత్రకూట మండలం నందుసువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కేఈ స్థల సాయి ఆధ్వర్యంలో అంకురార్పణ చేసి మార్చి 3న ఉదయం 7.29 గంటలకు సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠ, కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా రూ.75 లక్షల విరాళాలతో శ్రీరామచంద్ర స్వామికి తయారు చేయించిన నూతన సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠా మహోత్సవాలను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ బాధ్యులు కోరారు.

ఇది చదవండి: ఇప్పటికీ పల్లెల్లో కనిపిస్తున్న ప్రాచీన కళ.. చిరుతల రామాయణం అంటే ఏంటో తెలుసా..?

ఈ ఏడాది మార్చి 30వ తారీకు జరగనున్న సీతారాముల కళ్యాణం శ్రీరామనవమితో పాటు మార్చి 31 వ తారీకు జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని నూతన వాహన సేవలు అందుబాటులోకి రావడంతో రామభక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సువర్ణమైన ఈ వాహనాలలో రాములవారు భద్రాద్రి పురవీధులలో తిరిగి సేవ ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో రాజ వీధిలో నివసించే ప్రజల సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నూతన వాహనాలను భద్రాద్రి దేవస్థానానికి అందజేసిన దాతల బంధువులు అంకురార్పణ సమయంలో భద్రాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు దాతల తల్లిదండ్రులు న్యూస్ 18తో మాట్లాడుతూ.. విదేశాలలో ఉన్న తమ పిల్లలు ఇలా భద్రాద్రి రామయ్య సేవలో పాల్గొనడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఇంతటి గొప్ప కార్యంలో భాగస్వామ్యం చేసినందుకు భద్రాద్రి దేవస్థానం అధికారులకు పలు కృతజ్ఞతలు తెలిపారు.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana