హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: గొర్రెల పంపిణీ పథకం అమలు ఇలాగేనా? డబ్బు డిపాజిట్ చేసి ఎదురు చూస్తున్న లబ్ధిదారులు

Bhadradri: గొర్రెల పంపిణీ పథకం అమలు ఇలాగేనా? డబ్బు డిపాజిట్ చేసి ఎదురు చూస్తున్న లబ్ధిదారులు

గొర్రెలు

గొర్రెలు

మొదటి విడతగా ఎంపికైన 7,511 మంది లబ్ధిదారులకు గానూ 6,499 మందికి రూ. 69.20 కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు. ఒక యూనిట్లో 20 గొర్రెలు ఒక పొట్టేలు చొప్పున అందించారు. మిగిలిన 1,012 మంది లబ్ధిదారులకి విడతల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాల ఫలాలు లబ్ధిదారుకు చేరడంలో ఏళ్లు గడుస్తుండడంతో అధికార పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలకు (Schemes) లబ్ధిదారుల వైపు నుంచి కూడా తమ వాటా బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వ వాటాను జమచేసి ఆ పథకానికి సంబంధించిన గ్రాంటును లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈ క్రమంలో తమ వాటాలు జమ చేసి లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సంఘటనలు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి.

  గొల్ల కురుమలను (Golla Kuruma) ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని (Sheep distribution scheme) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. యూనిట్ ధరలో లబ్ధిదారుడు 25 శాతం వాటా చెల్లిస్తే, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేసింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 136 సొసైటీల్లో 11,765 మంది లబ్ధిదారులను గుర్తించింన అధికారులు మొదటి విడతలో 7,511 మంది లబ్ధిదారులకు రెండో విడతలో మిగిలిన 4,254 లబ్ధిదారులకు లాభం చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా మొదటి విడతగా ఎంపికైన 7,511 మంది లబ్ధిదారులకు గానూ 6,499 మందికి రూ. 69.20 కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు.

  ఒక యూనిట్లో 20 గొర్రెలు ఒక పొట్టేలు చొప్పున అందించారు. మిగిలిన 1,012 మంది లబ్ధిదారులకి విడతల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు. వీరంతా లబ్ధిదారుల వాటా 25% చొప్పున సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి నాలుగేళ్లు దాటుతుంది. అయినా ఇంతవరకు గొర్రెల పంపిణీ కార్యక్రమం జరగలేదు, తీవ్ర జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

  కాగా, ఇటీవల కాలంలో రెండో విడతగా మిగిలిన 4,254 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా ఇంతలోనే లబ్ధిదారులకు యూనిట్ విలువను పెంచారు. పథకం ప్రారంభ సమయంలో ప్రభుత్వం యూనిట్ విలువ రూ. లక్ష 25 వేలు ఉండగా ప్రస్తుతం రెండో విడతకు ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ. లక్ష 75 వేలకు పెంచింది. ఈ ప్రకారం 25 శాతం లబ్ధిదారుడి వాటా కింద రూ. 43,750 లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉండగా మిగిలిన రూ. 1,31,500 ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుంది. మరోవైపు రెండో విడత గొర్రెల పంపిణీ విషయంలోనూ అధికారులు ప్రచారం నిర్వహించడం లేదని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  Primitive man tombs: న్యూస్ 18 ఎఫెక్ట్: కదిలిన పర్యాటకశాఖ, ఆదిమ మానవ ప్రాంతాలకు గుర్తింపు 

  మొదటి విడతలో ఎంపికై గొర్రెలు అందని లబ్ధిదారులు గొర్రెల కోసం నాలుగున్నరలుగా ఎదురు చూస్తుంటే... అధికారులు మాత్రం సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ పూర్తి స్థాయిలో కేటాయించకపోవడంతో గుట్టుగా కొంతమంది లబ్ధిదారుల నుంచి తమ వంతు వాటా కట్టించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే జిల్లా అధికారులు మాత్రం రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులకు రూ. 53.32 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉందని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించినట్లు తెలిపారు.

  రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం విషయమై పశువైద్యాధికారులతో జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,106 మంది లబ్దిదారులు తమ వాటా ధనం చెల్లించారని, ప్రభుత్వ సబ్సిడీని కలెక్టర్ అకౌంట్లో కాగానే గొర్రెలను పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా అధికారులు తెలుపుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrari kothagudem, Local News, New scheme, Telangana Government

  ఉత్తమ కథలు