హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber crime : ఆ నటుడి ట్రస్ట్ పేరు వాడుకొని .. 4నెలల వయసున్న పసివాడి ప్రాణంతో ఆడుకున్నారు సైబర్‌ నేరగాళ్లు

Cyber crime : ఆ నటుడి ట్రస్ట్ పేరు వాడుకొని .. 4నెలల వయసున్న పసివాడి ప్రాణంతో ఆడుకున్నారు సైబర్‌ నేరగాళ్లు

Cyber ​​Fraud

Cyber ​​Fraud

Cyber crime: సాయం చేస్తామని దోపిడీ చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బిడ్డ ట్రీట్‌మెంట్ కోసం ఆర్దికసాయం చేయమని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఏ విధంగా మోసం చేశారో తెలుసా.

ప్రజల ఆర్ధిక పరిస్థితి, అనారోగ్యస్థితి, అవసరాలు తెలుసుకొని మరీ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు(Cybercriminals). ఆరోగ్యం బాగోలేదని వైద్య ఖర్చులకు డబ్బులివ్వమంటూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద భార్య,భర్తలను మోసం చేశారు దుర్మార్గులు. సోషల్ మీడియా(Social media) వేదికగా మనసున్న దాతల ఎవరైనా ఉంటి ఆర్ధికసాయం చేసి బిడ్డ ప్రాణాలు నిలబెట్టమని కోరిన జంటకు డబ్బు దానం చేస్తామని మాయమాటలు చెప్పి వాళ్ల బ్యాంక్ ఖాతా(Bank account) లో డబ్బులు కాజేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Basara iiit : జాబ్‌ రూపంలో జాక్‌పాట్ .. అక్కడ చదివిన స్టూడెంట్‌కి 65లక్షల జీతం



సాయం పేరుతో మోసం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లికి చెందిన భాస్కర్‌ దంపతులకు నాలుగు నెలల కొడుకు ఉన్నాడు. మేఘనాథ్‌ అనే చిన్నారికి లివర్‌ ఇన్‌ ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. పసివాడు కావడంతో బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని లివర్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని చెప్పారు. కనీసం 18లక్షలు రెడీ చేసుకోమని డాక్టర్లు భాస్కర్ దంపతులకు సూచించారు.

గాల్లో దీపంలా పసివాడి ప్రాణాలు..

లక్షలు ఖర్చు చేసి కాలేయ మార్పిడి ఆపరేషన్‌ చేయించే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు వారికి తెలిసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారా డబ్బులు సాయం చేయమని కోరారు. అయినప్పటికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో దాతల సాయం కోసం సోషల్ మీడియాలో తమ పరిస్థితి వివరిస్తూ పోస్ట్ పెట్టారు. అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న దంపతులను సైబర్ నేరగాళ్లు తమకు అవకాశంగా మాలచకున్నారు. మూడ్రోజుల క్రితం బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి తాము సోనూసూద్‌ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికారు. మీ అవసరం తెలిసి సాయం చేద్దామని కాల్ చేశామన్నారు. డబ్బులు వేయడానికి బ్యాంక్ అకౌంట్ చెప్పమన్నారు. వివరాలు తెలుసుకున్న తర్వాత ఓటీపీ, ఏటీఎం కార్డు నెంబర్‌ అడిగితెలుసుకున్నారు. ఇది జరిగిన క్షణాల వ్యవధిలోనే బాధితుడు భాస్కర్ బ్యాంక్ ఖాతాలో ఉండాల్సిన 14వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు విత్‌ డ్రా చేసుకున్నారు.

Murder Plan : యాక్సిడెంట్ స్టైల్లో హత్య .. అత్తమామ పాలిట అల్లుడే విలన్



ఆదుకోవాలని వినతి..

సాయం పేరుతో బ్యాంక్‌ వివరాలు సేకరించి తమ డబ్బులే కాజేశారని తెలుసుకున్న భాస్కర్‌ అతని భార్య తీవ్రంగా మదనపడ్డారు. తమకు జరిగిన అన్యాయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఎలాగైనా తమకు న్యాయం చేయమని..పోయిన డబ్బు తిరిగి వచ్చేలా చూడమని పోలీసులను బాలుడి తల్లిదండ్రులు వేడుకున్నారు. ఓవైపు బిడ్డ ప్రాణం గాల్లో దీపంలా ఉందని బాధపడుతున్న ఆ దంపతులను సైబర్ మోసగాళ్లు చీటింగ్ చేసి డబ్బులు కాజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్ని పట్టుకుంటామని..డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తామని చెప్పారు.

First published:

Tags: Bhadradri kothagudem, CYBER FRAUD, Telangana crime news

ఉత్తమ కథలు