హోమ్ /వార్తలు /తెలంగాణ /

గోదావరిలో మొసళ్ల అనుమానాస్పద మృతి.. కారణం ఇదేనా..?

గోదావరిలో మొసళ్ల అనుమానాస్పద మృతి.. కారణం ఇదేనా..?

X
గోదావరిలో

గోదావరిలో మొసళ్ల అనుమానాస్పద మృతి

నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు.. అని చిన్నప్పుడు చదువుకున్న మాటలు. నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నది అయినప్పటికీ, చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగలదని దాని అర్ధం. కానీ ప్రస్తుతం ఆ నీళ్లే మొసళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు.. అని చిన్నప్పుడు చదువుకున్న మాటలు. నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నది అయినప్పటికీ, చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగలదని దాని అర్ధం. కానీ ప్రస్తుతం ఆ నీళ్లే మొసళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడాది వ్యవధిలో ఐదుకు పైగా మొసళ్ళు మృత్యువాతకు గురయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డి పాలెంగ్రామం వద్ద గోదావరి నదిలో చోటుచేసుకుంటున్న ఈ సంఘటనలు ప్రస్తుతం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. పవిత్ర గోదావరి నది కలుషితం అవడం దీనికి ప్రధాన కారణమని స్థానికులు వాపోతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీ పేపర్ తయారీ పరిశ్రమను 1975లో ఏర్పాటు చేశారు. పేపర్ ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే రసాయన వ్యర్థ జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో శుద్ధి చేయాల్సి ఉంటుంది. తర్వాతే ఆ నీళ్లను గోదావరిలో కలపాలి. కానీ, సదరు సంస్థ ఈ పని చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఖర్చు ఎక్కువ అవుతుందని ఇతర మార్గాలను ఎంచుకున్నది. సారపాకలోని పరిశ్రమ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వద్ద ఉన్న గోదావరిలోకి పైపులు వేసి మరీ రసాయన వ్యర్ధ జలాలను తరలిస్తున్నది. రోజూ వేల లీటర్ల నీటిని నదిలో కలిపేస్తుందన్న ఆరోపణలున్నాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో ఇక్కడ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగిస్తోంది.

ఇది చదవండి: గొర్రెల పెంపకాన్ని చీప్ గా చూడొద్దు.. ఇలా చేస్తే లాభాల పంటే

వర్షాకాలంలో ఈ పరిశ్రమ కలిపే వ్యర్థ జలాలు గోదావరి ప్రవాహంతో పాటు కొట్టుకుపోయి భద్రాద్రిలో స్నానాలు చేసే భక్తుల చర్మరోగాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నీటిని తాగుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పరిసర ప్రాంతాల్లోని 30కి పైగా గ్రామాలు చర్మ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా వేసవికాలం రావడంతో గోదావరి నది అడుగంటుతుంది. ఈ నేపథ్యంలోఐటీసీ పరిశ్రమ సారపాక నుంచి పైపుల ద్వారా రెడ్డిపాలెంలోని గోదావరిలోకి పంపే రసాయన వ్యర్థ జలాలు మడుగులా తయారవుతున్నాయి. ఇందులో నీళ్లు తాగే పశువులు, పక్షులకు రోగాలొస్తున్నాయి. చేపలు చనిపోతున్నాయి. పశువులను గోదావరి తీరానికి తీసుకువస్తే అక్కడే మేత మేసి మడుగులో నీళ్లు తాగి వ్యాధులు సోకి చనిపోతున్నాయి.

మేకలు, గొర్రెలకు కూడా రోగాలు సోకడంతో వైద్యం చేయించాల్సి వస్తోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా తాజాగా మొసళ్లు కూడా మృత్యువాత పడడం కలకలం సృష్టిస్తున్నది. వర్షాకాలంలో గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి మొసళ్లు పక్కనే ఉన్న మడుగుల్లో ఉంటాయి. వేసవికాలంలో ఈ మడుగుల్లోని నీళ్లు ఎండిపోవడంతో అవి నదిలోని మడుగులకు చేరుతాయి. అయితే, ఐటీసీ పేపర్ పరిశ్రమ నుండి వచ్చే వ్యర్ధాలు చేరే మడుగులలో పడిన మొసళ్ళు వ్యర్ధాల ప్రభావంతో చనిపోతున్నాయని చెప్తున్నారు. ఇలా ఇప్పటివరకు నాలుగు మొనళ్లు చనిపోయినట్టు సమాచారం ఉండగా.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రాంతంలో మొసళ్ల మనుగడను కాపాడాల్సిందిగా జంతు ప్రేమికులు కోరుతున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Godavari river, Local News, Telangana

ఉత్తమ కథలు