Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
తెలంగాణ (Telangana) రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి Singareni Calories). గొప్ప చారిత్రకు, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది సింగరేణి. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వరంగ సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జాప్యం పట్ల పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. 2017 అక్టోబర్ లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య అధికార టిఆర్ఎస్ పార్టీ అనుబంధ బొగ్గు ఘని కార్మిక సంఘం (టీబీజీకేస్) ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండేళ్ల కాల పరిమితితో జరిగిన ఎన్నికలు ఐదేళ్లు కావస్తున్న ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించకపోవడం వెనక మతలభేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలోగుర్తింపు సంఘం ఎన్నికల జాప్యంపై సింగరేణి కార్మిక వర్గం అసహనం వ్యక్తం చేస్తుంది. తమ విలువైన డిమాండ్ల పరిష్కారానికి గుర్తింపు ఎన్నికలతో ముడిపడి ఉండటంతో ఎన్నికలు సాధ్యమైనంత త్వరలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు సింగరేణి కార్మికులు. నిజానికి సింగరేణి వ్యాప్తంగా సుమారు 42 వేల మంది కార్మికులు తమ హక్కుల పరిష్కారం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎన్నికల నిర్వహించాలని ఇప్పటికే ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా సింగరేణి సంస్థలో కేవలం కార్మిక సంఘాలలే ప్రచారం నిర్వహించుకొని ఎన్నికల్లో పాల్గొనేవి .
కానీ దీనికి భిన్నంగా 2017 లో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రభుత్వం సామదాన దండోపాయలు ఉపయోగించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలులను రంగంలోకి దింపి సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యంకు తెర లేపింది. ఇదే విషయమై అప్పట్లో ప్రత్యర్థి యూనియన్ ఏఐటియుసి ఘాటుగానే విమర్శించింది. అప్పటివరకు సింగరేణి సంస్థలో ఆదిపత్యాన్ని కొనసాగించిన ఏఐటీయూసీ సింగరేణి ఎన్ని కల్లో ఓటమినీ చవిచూసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సింగరేణిలో అధికార పార్టీ యూనియన్ కు ఏఐటియుసికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
కానీ ఇటీవల జరిగిన మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలు కమ్యూనిస్టు పార్టీలను అధికార పార్టీకి నూతన స్నేహం చిగురించింది. మునుగోడులో సిపిఐ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతునిచ్చి గెలిపించే విషయంలో కీలక పాత్ర పోషించింది. ఇదే ఇప్పుడు సింగరేణి కార్మిక ఎన్నికల జాప్యానికి కారణంగా తెలుస్తుంది. అక్కడ మద్దతు ఇచ్చిన సిపిఐకి అను బంధంగా ఉన్న ఏఐటీయుసీ సింగరేణి లో అతిపెద్ద యూనియన్ గా కొనసాగుతుంది. ఇదే సందర్భంలో ప్రస్తుతం టిఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీబీజ్ కేస్ గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న క్రమంలో తిరిగి ఎన్నికలు జరిగితే మునుగోడు మద్దతు సింగరేణిలో ఎలా పునరావృతం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడ స్నేహంగా మెలిగి ఇక్కడ శత్రువులాగా మారితే సింగరేణి కార్మికులు ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం లేకపోలేదు. సింగరేణిలో ఎన్నికలు జరిగితే ఎవరు ఎవరి కోసం త్యాగం. చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. లేదా సింగరేణిలో ఎవరి దారి వారిదే అయితే మునుగోడు పొత్తు నాయకత్వం స్వార్ధం కోసం జరిగింది గానే భావించవస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ గొడవ ఎలా ఉన్నా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జాప్యం లేకుండా నిర్వహించాలని సింగరేణి కార్మికులు యాజమాన్యాన్ని ఇటు కార్మిక శాఖ అధికారులను కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Singareni Collieries Company, Telangana