(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటోంది. గత 35 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి అయ్యప్ప దేవాలయాన్ని పాల్వంచ కేంద్రంగా నిర్మించారు. కాలక్రమైనా కొన్ని పరిణామాల వల్ల ప్రస్తుతం అట్టి దేవాలయాన్ని పూర్తిగా తొలగించి భక్తులు సహకారంతో రూ. 3కోట్ల వ్యయంతో ప్రస్తుతం నూతనంగా అయ్యప్ప ఆలయం అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. నేపద్యంలో పనులన్నీ పూర్తి కావస్తుండగా పూర్తి కావస్తుండగా పనులన్నీ ఫిబ్రవరి 5న విగ్రహ ప్రతిష్ఠతో ఆలయాన్ని ప్రారంభించునున్నారు.
ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణాన్ని చిన్న తిరుపతి , సింహాచలం దేవాలయ ప్రభుత్వ స్థపతి ఆకుల అమర్ రాజా పర్యవేక్షణలో నిర్మాణ పనులు ప్రారంభం కాగా, తమిళనాడు , కేరళ రాష్ట్రాలకు చెందిన శిల్పులు ఆలయ ప్రాకారాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఈ నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయానికి అనుసంధానంగా శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉండటంతో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఇదిలా ఉండగా ఈ పుణ్యక్షేత్రంగా ప్రతి ఏటా ఇక్కడ దాదాపు 3 వేల మంది భక్తులు అయ్యప్ప మాలధారణ చేపడుతుంటారు.
100 రోజుల పాటు రోజుకు 500 మందికి అన్నదాన సత్రంలో భిక్ష అనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్న నూతన అయ్యప్ప ఆలయాన్ని రెండు అంతస్తులతో చూడచక్కగా నిర్మిస్తున్నారు. కింద ధ్యాన మందిరం, పైన స్వామి సన్నిధానాలు సిద్ధం చేశారు. 18 మెట్లు, 43 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం, 18 మెట్లకు ఇత్తడి తాపడం, 40 పిల్లర్లు, రెయిలింగ్, ఆలయం చుట్టూ అయ్యప్ప స్వరూపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గత ఏడాదిన్నర నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రానికి చెందిన 25 మంది శిల్పులు ఆలయ ప్రాకారాలు తీర్చిదిద్దారు.
కాకినాడకు చెందిన పలువురు ఆర్టిస్ట్లు రంగులు అద్దారు. ఇదిలా ఉండగా సుమారు ఎకరంన్నర స్థలంలో 1985 లో అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెలంగాణాలోనే పాల్వంచలో తొలుత స్వామి విమోచనానంద నిర్మించారు. ఈ ఆలయంలో గతంలో స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు గడ్డపారలతో పెకిలించారు. అంతేకాకుండా ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. దీంతో నూతన ఆలయం నిర్మించేందుకు పెద్ద ఎత్తున స్థానిక భక్తులు ముందుకొచ్చారు. శబరిమలైలో వం శ పారంపర్యంగా పూజలు చేస్తున్న కంఠారి మోహనార్ తాంత్రి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana