హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: ఇకపై ఆర్టీసీ బస్సులో కండక్టర్ కనిపించడేమో.., కారణం ఇదే..!

TSRTC: ఇకపై ఆర్టీసీ బస్సులో కండక్టర్ కనిపించడేమో.., కారణం ఇదే..!

టీఎస్ఆర్టీసీలో కండక్టర్లు కనిపించరా..

టీఎస్ఆర్టీసీలో కండక్టర్లు కనిపించరా..

టికెట్...టికెట్.. అంటూ ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) ప్రయాణికుల నుంచి టికెట్ వసూలు చేసే కండక్టర్లు ఇకపై కనిపించరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆర్టీసీలో టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్) డ్రైవర్ విధానాలతో కండక్టర్ ఉద్యోగాలకు యాజమాన్యం మంగళంపాడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  టికెట్...టికెట్.. అంటూ ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) ప్రయాణికుల నుంచి టికెట్ వసూలు చేసే కండక్టర్లు ఇకపై కనిపించరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆర్టీసీలో టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్) డ్రైవర్ విధానాలతో కండక్టర్ ఉద్యోగాలకు యాజమాన్యం మంగళంపాడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆర్టీసీలో ప్రస్తుతం కండక్టర్ విధానం కొనసాగుతున్నా... భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తీసేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradr Kothagudem District) లోని పలు ఆర్టీసీ డిపోలలో కండక్టర్ లేకుండా టిమ్ విధానంతో డ్రైవింగ్ వ్యవస్థను నడిపించాలని రాష్ట్ర ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డ్రైవర్లకు ఇష్టం లేకున్నా డ్రైవింగ్‌తో పాటు టికెట్ ఇచ్చే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

  ఆమేరకు హైదరాబాద్ (Hyderabad) వెళ్లి టిమ్ ట్రైనింగ్ తీసుకుని రావాల్సిందిగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లు స్థానిక ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. ట్రైనింగ్‌కు వెళ్లబోమని నిరాకరించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవద్దని డిపో మేనేజర్లు సంబంధిత అధికారులకు సూచించడంతో కొంత మంది డ్రైవర్లు ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చారు. ఇద్దరు డ్రైవర్లు నిరాకరించారని అధికారికంగా తెలిసినా, ఇలానే మరికొందరు డ్రైవర్లు అదనపు బాధ్యతను నిర్వహించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

  ఇది చదవండి: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపో పరిధిలో టిమ్ ( టిక్కెట్ ఇష్యూ మిషన్ )తో పలు బస్సులను నడుపుతున్నారు. ఈ డిపోల నుంచి హైదరాబాద్, గోదావరిఖని, తిరుపతి , శ్రీశైలం, విజయవాడ , గుంటూరు ప్రాంతాలకు టిమ్ పద్ధతిలో అధికారుల బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

  ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

  ఈ పద్ధతిలో భాగంగా .. బస్టాండ్లలో నిలిపి టిక్కెట్ కొట్టడం వల్ల ప్రయాణానికి ఆలస్యమవుతుంది. టిక్కెట్ మరిచిపోతే ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న ఆందోళన సహజంగానే డ్రైవర్లకు ఎక్కువగా ఉంటుంది. ఎందు కంటే ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోకపోయినా డ్రైవర్ పైనే క్రమశిక్షణ చర్యలు తప్పవు. బస్సు ఎక్కడైనా మరమ్మతులకు గురైనా, పంక్చర్ పడ్డా డ్రైవర్ ఒక్కరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో బస్సుల్లో పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్ గూడ్సు వంటి వాటిని కొందరు సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడితే లగేజీని సరిచూడడానికి వీలుపడని డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తారు. ఈ తలనొప్పులన్నిటి వల్ల డ్రైవింగ్ పై ఏకాగ్రత కోల్పోతామని, ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ ఉండదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది కండక్టర్లు నిరుద్యోగులుగా మిగులుతారు. అంతేకాకుండా కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. అధిక మంది ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి వేళల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా, బస్సు ఆగిన ప్రాంతంలో దిగారా అని చూసుకుంటూ పలు కారణాలతో ప్రయాణికులతోనూ తిప్పలు పడుతూ ఆర్టీసీ టిమ్ డ్రైవర్లు నరకయాతన పడుతున్నారు. కండక్టర్, డ్రైవర్ ఇద్దరు పనులు ఒక్కరే చేయాల్సి రావడంతో మానసికంగా కృంగిపోతున్నారు. ఫలితంగా డ్రైవింగ్‌లో ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమస్యను గుర్తించి టిమ్ వ్యవస్థను రద్దు చేయాలనీ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Tsrtc

  ఉత్తమ కథలు