హోమ్ /వార్తలు /తెలంగాణ /

సీతారామయ్య పెళ్లికి రండి.. సీఎంను ఆహ్వానించిన వైదిక కమిటీ!..

సీతారామయ్య పెళ్లికి రండి.. సీఎంను ఆహ్వానించిన వైదిక కమిటీ!..

X
ఘనంగా

ఘనంగా సీతారాముల కల్యాణం

Telangana: భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మార్చి 30వ తేదీన జరిగే సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి వేడుకలకు రావాల్సిందిగా భద్రాద్రి దేవస్థానం అర్చకులు, అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మార్చి 30వ తేదీన జరిగే సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి వేడుకలకు రావాల్సిందిగా భద్రాద్రి దేవస్థానం అర్చకులు, అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. హైదరాబాదులోని ముఖ్యమంత్రి స్వగృహంలో ప్రత్యేకంగా సమావేశమైన భద్రాద్రి దేవస్థానం వైదిక అర్చక బృందం ప్రతినిధులు మార్చి 30వ తేదీన జరగబోయే సీతారాముల కల్యాణానికి సంబంధించి మొదటి ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు అనంతరం వేద ఆశీర్వచనాన్ని పఠించారు. దేవస్థానం ఆహ్వాన పత్రికను అందుకున్న ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో సీతారాముల కల్యాణానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనంతరం ఆనాటి నుంచి నేటి వరకు భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి గైర్హా జరవుతున్నారు.

నిజానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ క్రమంలో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి హోదాలో అందజేయాల్సిన ఆచారం కొనసాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రులు సైతం ఈ ఆచారాన్ని కొనసాగించారు. కానీ, అందుకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీరామనవమి కళ్యాణ వేడుకలకు గైహాజరవుతుండడం స్థానిక రామ భక్తులు ఆందోళన చెందుతున్న విషయం.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు సైతం ఇదే విషయాన్ని అస్త్రంగా ఉపయోగిస్తూ పలుమార్లు ముఖ్యమంత్రిని విమర్శించిన సందర్భాలులేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి భద్రాచల ఆలయ అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధి లేదని భద్రాచల రాముల వారి కళ్యాణానికి వచ్చే తీరిక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపణలు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. ఇటీవల గోదావరి వరదల సందర్భంగా భద్రాచల పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాములవారి దర్శనానికి రాకపోవడం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో భద్రాచలం వచ్చేందుకు ముఖ్యమంత్రికి సుముఖత లేదన్న విషయం స్పష్టమవుతుంది.

ఇలా ఉండగా ఈ ఏడాది భద్రాద్రి, సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమితో పాటు 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం మహోత్సవం కూడా జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి సైతం హాజరవుతాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా ఇటీవల భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి రివ్యూ మీటింగ్ లో మంత్రి పువ్వాడ సైతం రాబోయే శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి రానున్నట్లు ఏర్పాట్లు చేయడంతో పాటు హెలిప్యాడ్ లు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తరుణంలో మార్చి 30న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రావాలనిగతంలో ప్రకటించిన విధంగా భద్రాద్రి దేవస్థానాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక రామభక్తులు కోరుతున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు