రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
స్ట్రీట్ ఫుడ్స్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఫుడ్ బెల్ పూరి. క్షణాల్లో తయారు చేసే ఈ బెల్ పూరి తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఉత్తర భారత దేశానికి చెందిన ఈ వంటకం బొంబాయిలో అత్యంత ప్రజాదారణ కలిగిన వంటకంగా లభిస్తుంటుంది. తినడానికి కాస్త ఉప్పగా తీపిగా కారంగా ఉండే ఈ వంటకం తక్కువ కేలరీలు ఉండి ఎక్కువ పోషక విలువలు ఉన్న భారతీయ సంప్రదాయ వంటకాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవబడుతున్న ఈ వంటకాన్ని భద్రాద్రి ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని హరిత హోటల్ లో ఇటీవల ప్రత్యేకంగా బేల్ పూరి స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్ ప్రాంతానికి చెందిన జావిద్ అనే నిర్వహకుడు పట్టణంలోని హరిత హోటల్ కేంద్రంగా బేల్ పూరిని తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు.
ప్లేట్ యాబై రూపాయలకి అత్యంత సుందరంగా అలంకరించి అందిస్తూ ఉండడంతో పట్టణవాసులు బేల్ పూరీలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి బేల్ పూరి తింటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సహజంగా లభించే టమాట, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేరుశెనగ, బూందీ మిక్చర్, మరమరాలు ఉపయోగిస్తూ క్షణాల్లో తయారు చేసే ఈ వంటకం రుచితో పాటు అనేక పోషక విలువలు కూడా కలిగి ఉన్నట్లు తెలుపుతున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా కరకరలాడే పఫ్డ్ రైస్, క్రంచీస్ (నమ్‌కీన్) దంచిన పాప్డీ, వేరుశెనగలు, మసాలా చనా పప్పు (స్పైసీ ఫ్రైడ్ స్ప్లిట్ చిక్‌పీస్), ఉల్లిపాయ, టొమాటో, బంగాళాదుంప వంటి కూరగాయలు, చాట్ మసాలాతో రుచిగా, మూడు చట్నీలు - తీపి, టమ్‌కీన్‌లను కలిపి భేల్‌పూరి తయారు చేస్తారు.
సాయంత్రం సమయంలో ఇంట్లో క్షణాల్లో కూడా ఈ వంటకాన్ని తయారు చేసుకునేందుకు వీలు ఉండడంతో ఎక్కువ మంది మహిళలు ఈ వంటకాన్ని స్నాక్స్ రూపంలో చేసి పిల్లలకు అందించేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజా కూరగాయలు, వేరుశనగ గింజలు, మరమరాలు, వస్తువులను ఉపయోగించి వాటికి సరిపడా ఉప్పు, కారం, చింతపండు పులుసు, సరిపడ మసాలాను జోడించి ఈ వంటకాన్ని తయారు చేస్తారు.
ఆఖరిగా ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు పచ్చి టమాటా ముక్కలు కోతిమీర ఆకులు పుదీనా వంటివి అందంగా అలంకరించడంతో బేల్ పూరి తినేందుకు అత్యంత అందంగా కనిపిస్తుంది. రుచి కూడా కాస్త డిఫరెంట్ గా ఉండడంతో చిన్నపిల్లలు సైతం బేల్ పూరిని తినేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Telangana