హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం పంచాయితీ .. ప్రాజెక్టుతో భద్రాచలానికి ఢోకా లేదన్న కేంద్రం

Telangana: ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం పంచాయితీ .. ప్రాజెక్టుతో భద్రాచలానికి ఢోకా లేదన్న కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

Central Government: ఏపీ ప్రభుత్వం కడుతున్న పోలవరం ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్‌తో టెంపుల్ సిటీగా పేరొందిన భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ ప్రభుత్వం నెత్తినోరు మొత్తుకుంటున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది.ఈ భేటీలో కేంద్రం ఏం క్లారిటీ ఇచ్చిందంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

    (G.SrinivasReddy,News18,Khammam)

    పోలవరం ప్రాజెక్టు(Polavaram project)నిర్మాణం వల్ల వచ్చే బ్యాక్ వాటర్‌తో భద్రాచలం(Bhadrachalam)ప్రాంతానికి ఎలాంటి ముప్పు లేదని కేంద్రం తేల్చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా మరింత ఎత్తుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన నేతల మధ్య దీనిపై మాటల యుద్ధం కూడా నడిచింది. తెలంగాణ(Telangana)ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని సైతం నియమించింది. అప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సహా తెలంగాణ(Telangana), ఒడిషా (Odisha) చత్తీస్‌ఘడ్(Chhattisgarh)రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులతో  సమావేశం నిర్వహించింది. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్రం పోలవరం వల్ల ఎవరికీ నష్టం లేదని తేల్చేసింది.

    TRS | Viral video : మంత్రి అనుచరుల అత్యుత్సాహం .. కలెక్టర్, ఎస్పీ కళ్ల ముందే సాధారణ వ్యక్తిపై దాడి

    భద్రాద్రికి ఢోకా లేదు..

    ఇటీవల వచ్చిన వరదలతో భద్రాచలానికి ముప్పు ఉందని దిగువన పోలవరం వద్ద ఏపీ ప్రభుత్వం కడుతున్న పోలవరం ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్‌తో టెంపుల్ సిటీగా పేరొందిన భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ ప్రభుత్వం నెత్తినోరు మొత్తుకుంటున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది. దీంట్లో పోలవరం ప్రాజక్టు వల్ల భద్రాచలానినికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ‌లోని భ‌ద్రాచ‌లానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండ‌బోద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

    పోలవరం నిర్మాణంపై కేంద్రం క్లారిటీ ..

    ఏపీకి చెందిన ఈ ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కే కాకుండా ఒడిశా , ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌కు కూడా ముప్పు ఉండ‌బోద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేర‌కు గురువారం ఏపీ, తెలంగాణ‌, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌కు చెందిన అధికారుల‌తో కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రిత్వ శాఖ ప్ర‌త్యేకంగా ఓ స‌మావేశాన్ని నిర్వహించింది. వ‌ర్చువ‌ల్ పద్ధతిన జ‌రిగిన‌ ఈ స‌మావేశానికి 4 రాష్ట్రాల నుంచి నీటి పారుద‌ల శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు.అయితే పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలంగాణ‌, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని కూడా కేంద్రం తెలిపింది.

    RS Praveen Kumar : రాబోయే ఎన్నికలకు బీఎస్పీ పక్కా వ్యూహం .. ఆ జిల్లాలో మెజార్టీ స్థానాలపై కన్నేసిన RS ప్రవీణ్‌కుమార్

    నాలుగు రాష్ట్రాల అధికారులతో సర్వే..

    2009,2011ల‌లో పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్, దాని ప్ర‌భావాల‌పై స‌ర్వేలు జ‌రిగాయ‌ని తెలిపింది. పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్‌తో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌న్న విష‌యాన్ని నివారించేందుకు క‌ర‌కట్ట నిర్మించేందుకు ఇదివ‌ర‌కే ఏపీ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన విష‌యాన్ని కేంద్రం ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌రోమారు బ్యాక్ వాట‌ర్‌పై స‌ర్వే చేయించాల‌ని తెలంగాణ కోర‌గా…. అందుకు కేంద్రం నిరాక‌రించింది. అదే స‌మ‌యంలో క‌ర‌క‌ట్ట నిర్మాణానికి ఏపీ సిద్ధమైన నేప‌థ్యంలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు ఒడిశా ముందుకు రాలేద‌ని కేంద్రం తెలిపింది. ఇక త‌దుప‌రి చ‌ర్చ‌లు అక్టోబ‌ర్ 7న జ‌రుపుదామ‌న్న కేంద్రం… ఆ స‌మావేశానికి 4 రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజ‌రుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Bhadrachalam, Polavaram, Telangana News

    ఉత్తమ కథలు