హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: షుగర్ పేషెంట్లకు వరం.. ఈ పంటతో రైతులకు లక్షల్లో ఆదాయం

Business Idea: షుగర్ పేషెంట్లకు వరం.. ఈ పంటతో రైతులకు లక్షల్లో ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: ప్రస్తుతం ఎన్నో కంపెనీలు కాంట్రాక్ట్‌ పద్దతిలో స్టీవియా సాగు చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులను కంపెనీలే ఇస్తాయి. మీరు పంట పండిస్తే.. మళ్లీ ఆ కంపెనీయే మీ వద్ద పంటను కొంటుంది

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

ఈ మధ్య యువత ఉద్యోగాలు వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఆహార ఉత్పత్తులు వంటి సంప్రదాయ పంటలను పక్కనబెట్టి.. మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటే పంటను పడిస్తున్నారు. ముఖ్యంగా ఔషధ మొక్కల (Medicinal Plants) పెంపకం ద్వారా అధిక ఆదాయం అర్జిస్తున్నారు. తులసి, కలబంద వంటి ఔషధ గుణాలున్న మొక్కలను సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. స్టీవియా, శతావరి, సర్పగంధ, తులసి, ఆర్టెమిసియా అన్నూ, లిక్కోరైస్, అలోవెరా, శాతవరి, ఇసబ్గోల్ వంటి మొక్కల సాగుకు ఎకరాల్లో భూమి అవసరం లేదు. తక్కువ స్థలంలోనూ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.

మనదేశంలోఔపధ మొక్కలను పెంచే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. తక్కువ ఉత్పత్తి.. అధిక డిమాండ్ కారణంగా.. రైతులకు మంచి ఆదాయం వస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంత ప్రభుత్వం కూడా ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే తులసి, కలబంద, అశ్వగంధ వంటి మొక్కల సాగు బాగా పెరుగుతోంది. తులసి మొక్కలు సాధారణంగా మతపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే చాలా రకాల మందుల్లో దీనిని వినియోగిస్తారు. తులసిలో యూజినాల్. మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. 1 హెక్టారులో తులసి పండించడానికి కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, కానీ 3 నెలల తర్వాత ఈ పంట దాదాపు 3 లక్షల రూపాయల రాబడి ఇస్తుంది.

New Scheme: మహిళలకు శుభవార్త... రేపటి నుంచి కొత్త స్కీమ్... బెనిఫిట్స్ ఇవే

తులసి లాగే స్టీవియా సాగు (Stevia Farming) కూడా బాగా లాభదాయకమైనది. స్టీవియా కూడ తులసి జాతికి చెందినది. దీనిని తీపి తులసి అంటారు. స్టీవియా డయాబెటిస్ మందుల తయారీలో వినియోగిస్తారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ మధుమేహవ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ పంటకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. స్టీవియా సాగుకు ఎరువులు, పురుగుల మందులు కూడా అవసరం లేదు. కీటకాలు కూడా ఈ పంటకు హాని చేయలేవు. ఒకసారి పంట వేస్తే చాలు. ఐదు సంవత్సరాలు దిగుబడి ఇస్తుంది. ప్రతి ఏటా ఉత్పత్తి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. స్టెవియా మొక్క 60 నుండి 70 సెం.మీ పొడవు పెరుగుతుంది. స్టీవియా ఆకులు ఇతర మొక్కల మాదిరిగానే ఉంటాయి. కానీ అవి చక్కెర కంటే 25-30 రెట్లు తియ్యగా ఉంటాయి. ప్రతి మూడు నెలలకోసారి ఆకులను కోసి విక్రయించవచ్చు. భారతదేశంలోని బెంగళూరు, పూణే, ఇండోర్, రాయ్‌పూర్ వంటి నగరాల్లో స్టెవియా సాగు చేస్తున్నారు. పరాగ్వే, జపాన్, కొరియా, తైవాన్ మరియు అమెరికా వంటి దేశాల్లో కూడా స్టీవియాను పండిస్తారు.

మీరు సొంతంగా ఈ పంటను పండించవచ్చు. స్టీవియా విత్తనాలను విక్రయించే కంపెనీలు గురించి ఇంటర్నెట్‌లో వెతికి తెలుసుకోవచ్చు. ఐతే సొంతంగా పండిస్తే.. పంటను మీరే మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెటింగ్ మెలవకులు తెలియకుంటే.. కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఎన్నో కంపెనీలు కాంట్రాక్ట్‌ పద్దతిలో స్టీవియా సాగు చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులను కంపెనీలే ఇస్తాయి. మీరు పంట పండిస్తే.. మళ్లీ ఆ కంపెనీయే మీ వద్ద పంటను కొంటుంది. ఒక ఎకరం విస్తీర్ణంలో స్టెవియా సాగుకు రూ. లక్ష వరకు ఖర్చు వస్తుంది. కానీ రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. అంటే ఖర్చులు పోను.. రైతుకు 5 లక్షల నికర లాభం వస్తుంది.

First published:

Tags: Agriculture, Bhadradri kothagudem, Business, Farmers, Local News