Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
చిన్న వయసులోనే కూచిపూడి (Kuchipudi), భరతనాట్యం (Bharata Natyam) లో శిక్షణ ఇస్తూ పలువురు చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దుతుంది భద్రాచలం (Bhadrachalam) పట్టణానికి చెందిన నాట్య కళాకారుని భాగ్యశ్రీ. టిటిడి అనుబంధ నాట్య కళాశాలలో నాట్యాన్ని అభ్యసించిన భాగ్యశ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) భద్రాచల కేంద్రంగా శ్రీరామ నాట్యాలయం పేరుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. తాను సైతం ప్రదర్శనలు ఇస్తూ కూచిపూడి, భరతనాట్యం కళను విస్తృతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. యువజన ఉత్సవాలు, బాలోత్సవాలు, భద్రాద్రి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగే సాంస్కృతిక ఉత్సవాల నుంచి మొదలు రాష్ట్రస్థాయి ప్రదర్శనల వరకు భరతనాట్యంలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ పలు అవార్డులను సైతం అందుకుంది భాగ్యశ్రీ.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన భాగ్యశ్రీ ప్రస్తుతం తన భర్త సహకారంతో ఒక నాట్య కళాకారునిగా శ్రీరామ నాట్యాలయం పేరుతో ఓ శిక్షణా కేంద్రాన్ని నడుపుతుంది. ఇప్పటికే సుమారు 50 మందికి పైగా చిన్నారులకు కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్న భాగ్యశ్రీ భద్రాచలం ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో నివాసముంటున్న గిరిజనుల పిల్లలకు సైతం కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ ఇచ్చి వారితో ప్రదర్శనలు చేయించడం తన ముందున్న లక్ష్యం అని చెబుతుంది.
ఇదిలా ఉండగా భద్రాచలంలో నాట్యాచారిణి రమాదేవి వద్ద 6 సంవత్సరాలు కూచిపూడి నృత్య సాధన చేసింది. ఇదే సమయంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ముక్కోటి ఉత్సవాల్లో పలుమార్లు నృత్యం చేసి శాలువ సత్కారాలు పొందింది. తెలంగాణ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం పొందారు. భద్రాద్రి కళాభారతి, భద్రాద్రి బాలోత్సవ్ వంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందారు. ముఖ్యంగా భాగ్యశ్రీ సాయి ప్రదర్శించిన తరంగం అనే కూచిపూడి నృత్యంతో విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా సుమారు వెయ్యి మంది విద్యార్థినిలు ఉండగా గిన్నీస్ బుక్ రికార్డు పోటీలకు కేవలం తొమ్మిది మందినే ఎంపిక చేయగా వారిలో భాగ్యశ్రీసాయి ఒకరు.
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన రవీంద్ర భారతి తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 'మహతి' స్టేడియంలో ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో చదువుతున్న భాగ్యశ్రీ సాయి పలు ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి, భతర నాట్యంలో చెన్నై, తిరుపతి , హైదరాబాద్ లలో పలు ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. నిరు తీయ నిత్యాలయా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాత 50-50 కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ బృంద రికార్డు, ఇండియా ఏషియా బుక్ ఆఫ్ రికార్డు పోటీల్లో పాల్గొంది. భరత నాట్యంలో శివస్తుతి ప్రదర్శించి బృంద అవార్డు అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana