BHADRADRI KOTHAGUDEM BHADRADRI KOTTAGUDEM DISTRICT MUSLIMS CELEBRATING SRI RAMANAVAMI AT THE DARGAH SNR KMM
Religious harmony:భద్రాద్రి జిల్లా ఇల్లందులో అద్బుతఘట్టం..దర్గాలో శ్రీరాముని పట్టాభిషేకం
(దర్గాలో శ్రీరామపట్టాభిషేకం)
Religious harmony:భగవంతుడ్ని పూజించడానికి కులం,మతం లేదని నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ముస్లిం సోదరులు. ప్రఖ్యాతి గాంచిన నాగుల్‌మీరా దర్గాలో శ్రీరామనవమి వేడుకలతో పాటు రాములవారి పట్టాభిషేకాన్ని భక్తి భావనతో జరిపించారు.
ఆ గ్రామస్తులు ఎంతో ఆదర్శవంతులని నిరూపించుకున్నారు. సమాజంలో మానవ జీవన విధానం ఒకరితో మరొకరికి మూడి ఉంది తప్ప..కుల, మత, ప్రాంతాలతో ముడిపడి లేదని రుజువు చేశారు. దేవుడు ఎవరైతేనేం చేతులెత్తి మొక్కడానికి అని మనస్పూర్తిగా నమ్ముకున్నారు. అందుకే శ్రీరామనవమి(Sriramanavami)వేడుకలను అత్యంత వైభవంగా, ఎంతో భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు ముస్లిం(Muslims) సోదరులు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem)జిల్లా ఇల్లందు(Yellandu)కు సమీపంలో ఉన్న సత్యనారాయణపురం(Satyanarayanapuram)గ్రామ శివార్లలో హజరత్ నాగూల్‌మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ (Hazrat Nagool Meera Moula Chan Dargah Sharif)ఉంది. అక్కడే హిందూవులు ఆరాధ్యంగా కొలిచే శ్రీరామనవమి వేడుకలను ముస్లిం సోదరులు శాస్త్రోక్తంగా జరిపించారు. రాములవారి కల్యాణమే కాదు..మరుసటి రోజు సోమవారం(Monday) శ్రీరాముని పట్టాభిషేకం కూడా అంతే భక్తి భావనతో జరిపించారు. ముస్లింలు దేవాలయంగా కొలిచే దర్గాలో శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించి మతసామరస్యాన్ని చాటుకున్నారు. దర్గాలో ఇలా శ్రీరాముని కల్యాణం, పట్టాభిషేకం నిర్వహించడం ఇది రెండోసారి.
మత సామరస్యానికి ప్రతీక..
భద్రాచలం సీతారామాలయంలో భద్రాద్రిరాముడి కల్యాణం ఎంతో కమనీయంగా జరిగిందో అంతే అద్భుతంగా హజరత్ నాగుల్ మీరా దర్గాలో రాములోరి కల్యాణం జరిపించారు ముస్లీం సోదరులు. ముందుగా దర్గా మాలిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కొత్తగా తీసుకొచ్చిన సీతారామచంద్రుల లోహ విగ్రహాలను ప్రత్యేక మండపంలో ఉంచారు. అటుపై శ్రీరాముడి పట్టాభిషేకం కార్యక్రమాన్ని వేద మంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ జరిపించారు. లోకకల్యాణంగా భావించే ఈ దివ్యమైన కార్యక్రమం ముస్లిం సోదరులు నిర్వహించడంతో చూసేందుకు భక్తులు కూడా కుల, మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరై పట్టాభిషేకాన్ని తిలకించారు.సుమారు 18సంవత్సరాలుగా దర్గాలోని నాగుల్ మీరా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందడంతో ఎంతో మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు దర్గాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి ఎంతో విశిష్టత కలిగిన దర్గాలో కులమతాలకు అతీతంగా గతేడాది నుంచి శ్రీరామనవమి వేడుకలను దర్గా కమిటీ వారు నిర్వహిస్తూ వస్తున్నారు.
హిందూ,ముస్లిం భాయ్ భాయ్..
రూపం ఏదైనా దేవుడు ఒక్కటేనంటున్నారు హజరత్ నాగుల్ మీరా దర్గా మాలిక్ లక్ష్మీనారాయణ. భగవంతుడ్ని కొలిచే హృదయం నిష్కల్మషంగా ఉండాలన్నారు. అందుకే తమ దర్గాకు కూడా హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ వస్తుంటారని..మొక్కులు చెల్లించుకుంటారని తెలియజేశారు. తాము కూడా శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉండటం కారణంగా గతేడాది నుంచి రాములవారి కల్యాణం, పట్టాభిషేకం నిర్వహిస్తూ వస్తున్నామని తెలియజేశారు. ఇది తమకు ఎంతో సంతృప్తిని ఇస్తోందంటున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.