హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri kothagudem: ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్స్ కావాలా? ఇలా అప్లై చేసుకోండి

Bhadradri kothagudem: ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్స్ కావాలా? ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bhadradri kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు, పేద బాలికలు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించే సంస్థలు స్కాలర్షిప్ అప్లై చేసుకునే విధానంపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Bhadrachalam

(Kranthi Kumar, News 18, Bhadradri Kothagudem)

ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థులకు పలు సంస్థలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. చాలా మంది విద్యార్థులకు వీటి గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల సద్వినియోగం చేసు కోలేకపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు, పేద బాలికలు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించే సంస్థలు స్కాలర్షిప్ అప్లై చేసుకునే విధానంపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

కొటక్ కన్య(కొటక్ మహీంద్ర గ్రూపు)

సదరు కొటక్ కన్య(కొటక్ మహీంద్ర గ్రూపు) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు ఉపకార వేతనాన్ని అందించేందుకు విద్యార్థినుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. కుటుంబ వార్షిక వేతనం రూ.3.20 లక్షల లోపు ఉండి, ఇంటర్మీడియట్ లో 75% పైగా మార్కులు సాధించి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న న్యాక్ ఎన్ ఐఆర్ఎఫ్ అక్రిడేటెడ్ కళాశాలలోని బాలికలు ఈ ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఏడాదికి రూ.1.5 లక్షల ఉపకార వేతనాన్ని అందిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30.11.2022, పూర్తి వివరాలకు, ఆన్లైన్ అప్లికేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్సైట్kotakeducation.org సందర్శించి విద్యార్థినిలు తమ దరఖాస్తును అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

Warangal : చదివింది పదో తరగతి.. కానీ చేసేది డాక్టర్ వృత్తి..! చివరికి..!!

 ప్రగతి ఉపకార వేతన పథకం

డిప్లొమా చదువుతున్న బాలికలు ఈ పథకం ద్వారా ఉపకార వేతనాన్ని పొందేందుకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ని కోరుతున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు కలిగి ఉండాలి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు సైతం ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మొదటి సంవత్సరం డిప్లొమాలో చేరిన బాలికలు లేదా పదో తరగతిలో వృత్తి విద్య పూర్తి చేసి డిప్లొమాలో రెండో సంవత్సరంలో చేరే బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా బాలికలను ఎంపిక చేసి ఏడాదికిరూ.50,000. ఉపకార వేతనాన్ని అందిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30.11.2022 పూర్తి వివరాలకు www.aicte-pragati-saksham-gov.in సందర్శించి విద్యార్థినిలు తమ అప్లికేషన్ ఆన్లైన్ చేయవచ్చు.

కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్' (కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్)

సదరు సంస్థ పదవ తరగతిలో 75% పైగా మార్కులు, ఇంటర్మీడియట్ లో 60% పైన 2022లో నిర్వహించిన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన బాలబాలికలకు ఉపకార వేతనాన్ని అందించేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.వార్షిక కుటుంబ ఆదాయంరూ. 5 లక్షలలోపు ఉండి మూడేళ్ల డిగ్రీ కోర్సు , నాలుగేళ్ల ఇంజినీరింగ్. ఎంబీబీఎస్, బీడీఎస్ డెంటల్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఏడాదికి రూ.50వేలు. ఏటా రెన్యువల్ అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 31.12.2022దరఖాస్తు చేసుకునేందుకు www.colgate.com/en-in/smile-karo-aur-shuru-ho-jao/foundation-scholarship సందర్శించి అప్లికేషన్ ను పూర్తి చేయవచ్చు.

సాక్ష్యం ఉపకార వేతన పథకం.

దివ్యాంగ పిల్లలు (40 శాతం కంటే ఎక్కువ వైకల్యం) కలిగిన విద్యార్థులు అనుమతించిన ఏఐసీటీఈ కళాశాలల్లో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరిన వారు, డిప్లొమా చేసి ద్వితీయ సంవత్సరంలో చేరిన విద్యార్థులు అర్హులు. వార్షిక కుటుంబ ఆదాయం రూ 8 లక్షల లోపు ఉండాలి.‌ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో నుంచి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిరూ.50,000. కొంత కళాశాలఫీజుకు, పుస్తకాలు, స్టేషనరీ, ఇతర పరికరాల కొనుగోలు కోసం మంజూరు చేస్తారు. వసతి ఎంపికైన విద్యార్ధి ఖాతాకు నేరుగా ఉపకార వేతనం బదిలీ చేస్తారు.గృహం, వైద్య ఖర్చుల నిమిత్తం అదనంగా మంజూరు చేయరు.దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30.11.2022దరఖాస్తు చేసుకునేందుకు www.aicte-pragati-saksham-gov.in సందర్శించి అప్లికేషన్ను పొందవచ్చు.

PM Modi | Rozgar Mela: ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ కోర్సు పూర్తి చేయాల్సిందే.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ..

అమెజాన్' ఫ్యూచర్ సంస్థబాలికలకు ఉపకార వేతనాన్ని అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయంరూ. 3లక్షల వరకు ఉండి, మొదటి సంవత్సరం బీఈ / ఈటెక్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనుబంధ బ్రాంచిలు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కుటుంబంలో మొదటి సారి ఇంజినీరింగ్ చదువుతున్న బాలికలకు ప్రాధాన్యం.‌ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ఏటారూ. 1,80,000, అమెజాన్ నుంచి సాంకేతిక భవిష్యత్తు, అందులో ఇంటర్న్షిప్ ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 31.12.2022. దరఖాస్తు చేసుకునేందుకు www.amazonfutureengineer.com/scholarships సందర్శించి అప్లికేషన్ పొందవచ్చు.

స్వాంత్ ఉపకార వేతనం అనాథలు, కొవిడ్ లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఇంజినీరింగ్ ప్రథమ, డిప్లొమా నుంచి వచ్చి చేరిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందించేందుకు సదరు సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయంరూ.8 లక్షల లోపు కలిగి ఉండాలి. ఏటా 50 వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 2వేల మందికి మంజూరు చేస్తారు. వీరిలో ఇంజినీరింగ్ ప్రథమ విద్యార్థులు వెయ్యి మందికి, డిప్లొమా నుంచి వచ్చిన విద్యార్థులు వెయ్యి మందికి వేతనం మంజూరు చేస్తారు. ఉపకార వేతనం రెగ్యులర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు, డిప్లొమా నుంచి వచ్చిన వారికి మూడేళ్ల పాటు రెన్యువల్ అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30.11.2022దరఖాస్తు చేసుకునేందుకు scholarships.gov.in/సందర్శించి అప్లికేషన్ పొందవచ్చు.

First published:

Tags: Bhadradri kothagudem, EDUCATION, Khammam

ఉత్తమ కథలు