హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల కేంద్రంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

Bhadradri Kothagudem: కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల కేంద్రంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

X
ఉల్లాసంగా

ఉల్లాసంగా సాగిన క్రీడా పోటీలు

BhadradriKothagudem: రాష్ట్ర స్థాయి 6వ ఇంటర్ సొసైటీ లీగ్ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ముగిశాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

రాష్ట్ర స్థాయి 6వ ఇంటర్ సొసైటీ లీగ్ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ముగిశాయి. రాష్ట్రంలోని బీసీ, మైనార్టీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు, ఏకలవ్య, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల సొసైటీలకు చెందిన 3,500 మంది హాజరైన ఈ క్రీడా సంబరం నవంబర్ 28న ప్రారంభమై డిసెంబరు 1న ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఏడు సొసైటీలకు చెందిన విద్యార్థులంతా మొత్తం 13 క్రీడాంశాల్లో తలపడ్డారు. నాలుగు రోజులు పాటు సాగిన ఈ క్రీడా పోటీల్లో క్రీడాకారుల పోటాపోటీ ప్రదర్శనలతో కిన్నెరసాని క్రీడా మైదానం హోరెత్తింది.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ(ఐటీడీఏ భద్రాచలం) ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ ఇంటర్ సొసైటీ లీగ్ టోర్నమెంట్ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఈ క్రీడా పోటీల్లో ప్రధానంగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, జావెలిన్ - బాక్సింగ్ పోటీలను క్రీడాకారులు అత్యంత అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఈ 6వ ఇంటర్ సొసైటీ లీగ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 148 మంది రిఫరీలు, 550 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, 20 ఆర్గనైజింగ్ కమిటీల్లో 300 మంది వివిధ సొసైటీ ఉద్యోగులు, 300 మంది వంట సిబ్బంది, 3500 మంది క్రీడాకారులతో 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు.

ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ప్రత్యేక పర్యవేక్షణలో వసతి, భోజన విషయంలో లోటుపాట్లు తలెత్తకుండా చూసుకున్నారు. గురువారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులు, సొసైటీ అధికారులు, సిబ్బంది. నిర్వహించిన కవాతును తిలకించారు. అనంతరం జిల్లా గిరిజన క్రీడల అధికారి డా.ఎం.వీరునాయక్ ను ఏడు సొసైటీల అధికారులు, పీడీ, పీఈటీ, కోచ్, రిఫరీలు సన్మానించారు.

అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సీవోఈపీడీ లక్ష్మణ్నాయక్, క్రీడల రాష్ట్ర అధికారులు సోమేశ్, రామ్ లక్ష్మణ్, రవికుమార్, అరుణకుమారి, జ్యోతి, పార్థసారథి, డిప్యూటీ సెక్రటరీలు లతీఫ్, తిరుపతి , రామ్లాల్, జిల్లా గిరిజన క్రీడల అధికారి డా. ఎం. వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ తదితర 13 క్రీడల్లో పలువురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు.

Gujarat Elections: బీజేపీ ప్రచారానికి హైలైట్‌గా ప్రధాని మోదీ రోడ్‌ షో.. ఆప్ వరాలు ఇవే

చివరి రోజు జరిగిన తుది పోరులో ఓవరాల్ ఛాంపియన్ సోషల్ వెల్ఫేర్, ద్వితీయ స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్ (ఆశ్రమ), తృతీయ స్థానంలో మైనార్టీ గురుకులాలు నిలిచాయి. ఓవరాల్ ఆల్ ఏజ్ గ్రూప్ గేమ్స్ ఛాంపియన్ షిప్ సోషల్ వెల్ఫేర్ ప్రథమ, ట్రైబల్ వెల్ఫేర్ (ఆశ్రమ) ద్వితీయ. మైనార్టీ, (బీసీ) గురుకులాలు (తృతీయ). ఓవరాల్ ఛాంపియన్ షిప్ ఆల్ ఏజ్ గ్రూప్ స్పోర్ట్స్ సోషల్ వెల్ఫేర్, మైనార్టీ గురుకులం, ఆశ్రమ (ట్రెబల్ వెల్ఫేర్). ఓవరాల్.. ఆల్ ఏజ్ గ్రూప్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్: సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ స్కూల్స్(ట్రైబల్ వెల్ఫేర్), మైనార్టీ మూడో స్థానంలో నిలిచాయి.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు