హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: ఇలా చేస్తే ఏ విద్యార్థి స్కూల్ కి డుమ్మా కొట్టనే కొట్టరు!

Bhadradri Kothagudem: ఇలా చేస్తే ఏ విద్యార్థి స్కూల్ కి డుమ్మా కొట్టనే కొట్టరు!

X
teacher

teacher

ఉపాధ్యాయుల సహజంగా తమకు ఇచ్చిన భోధానాంశాలను పాఠశాల గదుల్లో విద్యార్థులకు తెలియజేస్తూ బ్లాక్ బోర్డులపై వాటిని వివరిస్తూ పాఠాలు చెప్పడం సహాజం. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా విధ్యార్థులకు పాఠాలు భోధించే విషయంలో వినూత్న శైలిని చూపెడుతుంటారు. విద్యార్థులతో స్నేహా బావంతో మెలుగుతూ వారికి చెప్పే పాఠాలు శ్రద్ధగా చెబుతూ...వచ్చే సందేహాలను కూడా నివృత్తి చేస్తుంటారు. ఇలా ఓ వినూత్న రీతిలో పాఠాలను బోధించే ఉపాధ్యాయులు కొందరు మాత్రమే ఉంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Kranthi Kumar, News 18, Bhadradri)

ఉపాధ్యాయుల సహజంగా తమకు ఇచ్చిన భోధానాంశాలను పాఠశాల గదుల్లో విద్యార్థులకు తెలియజేస్తూ బ్లాక్ బోర్డులపై వాటిని వివరిస్తూ పాఠాలు చెప్పడం సహాజం. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా విధ్యార్థులకు పాఠాలు భోధించే విషయంలో వినూత్న శైలిని చూపెడుతుంటారు. విద్యార్థులతో స్నేహా బావంతో మెలుగుతూ వారికి చెప్పే పాఠాలు శ్రద్ధగా చెబుతూ...వచ్చే సందేహాలను కూడా నివృత్తి చేస్తుంటారు. ఇలా ఓ వినూత్న రీతిలో పాఠాలను బోధించే ఉపాధ్యాయులు కొందరు మాత్రమే ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబాయిగూడెంలో తెలుగు ఉపాధ్యాయుడిగాపనిచేస్తున్న మాలోత్ భద్రు తనకో ప్రత్యేకతను చాటు కుంటూ విద్యార్థులకు భోధన చేయడం విశేషంగా నిలుస్తుంది.

ప్రధానంగా 7, 8 తరగతుల విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాలను నేర్పించే విధానం అందరినీ ఆకట్టుకుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కథలు, పాటలు, పద్యాలు, స్కిట్లు, బుర్రకథలు ద్వారా వాళ్లకు పాఠాలు అర్థం అయ్యే రీతిలో పిల్లలతో చెప్పిస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాడు. తరగతి గదిలోని పిల్లలో నుంచే కొంతమంది విద్యార్థులను ఎన్నుకొని వారిని పాఠ్యాంశంలోని పాత్రలను కేటాయించి వారి ప్రదర్శన ద్వారా మిగిలిన పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధనలు చేస్తున్నారు. పాఠ్యాంశాల్లోని సిలబస్ ఆధారంగా సబ్జెక్టును తరగతి గదిలో చెప్పడమే కాకుండా క్షేత్ర స్థాయిలో విద్యార్థులను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి వారికి పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో అవగాహణ కల్పించేందుకు కృషిచేస్తున్నాడు. ఇలా ఆడుతూ పాడుతూ చదువు చెప్పడం వల్ల పిల్లల హాజరు శాతం పెరిగి క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు.

అంతేకాకుండా ఇలా చేయడం వల్ల పిల్లల్లోని నైపుణ్యాలు వెలికి తీయడమే కాకుండా ప్రస్తుత కాలంలో కనుమరుగౌతున్న కుల వృత్తులను ఆయా వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే వారి స్థితి గతులు..వారి వృత్తి విద్యలను చాలా దగ్గరగా అంటే క్షేత్ర స్థాయిలో విధ్యార్థులను తీసుకువెళ్లి ప్రయోగాత్మకంగా భోధనాంశాన్ని వివరిస్తున్నాడు. కమ్మరి, వడ్రంగి, మేధర, దర్జి, రజక, నాయి బ్రాహ్మణ, స్వర్ణ కారుల కుల వృత్తులను చేసుకుంటూ జీవించే వారి వద్దకు వెళ్ళి ఆయా వృత్తుల్లో వారు అసమాన ప్రతిభను కనబరుస్తూ రాణిస్తున్న తీరును ప్రత్యక్ష్యంగా చూపుతున్నారు.

అంతే కాకుండా పలు వృత్తులను విద్యార్థులకు స్వయం అనుభూతిని కూడా పొందేందుకు సహాకరిస్తున్నాడు. ఇతర ఉపాధ్యాయులకు సూర్తి దాయకంగా మాలోత్ భద్రు నిలుస్తున్న తీరుపై ప్రధానోపాధ్యాయురాలు హెచ్ఎం నాగశ్రీ, ఉపాధ్యాయులు వీర వెంకమ్మ, సారయ్య కల్పనాదేవి, తిరుపతిరావు, పార్వతి, స్వేత శిబాబు తదితరులు అభినందించారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు