హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Farmers: రైతుల్లో ఆందోళన.. యాసంగి సాగుపై నీలినీడలు

TS Farmers: రైతుల్లో ఆందోళన.. యాసంగి సాగుపై నీలినీడలు

యాసంగి సాగుపై రైతుల ఆందోళన

యాసంగి సాగుపై రైతుల ఆందోళన

వేసవిలో కరెంట్ కష్టాలు తప్పకపోవచ్చనే ఉద్దేశంతో రైతులు యాసంగిలో పంటలు సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటి నుంచే 24 గంటల కరెంట్ సరిగా రావడం లేదు. ముందు ముందు కరెంట్ కోతలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నా యి.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

వేసవిలో కరెంట్ కష్టాలు తప్పకపోవచ్చనే ఉద్దేశంతో రైతులు యాసంగిలో పంటలు సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటి నుంచే 24 గంటల కరెంట్ సరిగా రావడం లేదు. ముందు ముందు కరెంట్ కోతలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నా యి. దీంతో యాసంగి సాగుకు నీరందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వారు కొన్ని ఎకరాలను సాగు చేయకుండా వదిలేస్తున్నారు. నీళ్లు అందే వరకే సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లో ఇప్పటి వరకు 50 శాతం కూడా సాగుకు నోచుకోలె. మరోవైపు గోదావరి వరదలు, నిరంతరంగా కురిసిన వానలతో యాసంగి సాగు లేటయిందని, దీంతో దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 2020-21లో 1,74,475 ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 2,15,463 ఎకరాల్లో యాసంగి సాగు అవుతుందని అధికారులు ప్లాన్ చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1,04,688 ఎకరాల్లో మాత్రమే సాగైంది. 78,762 ఎకరాల్లో వరి సాగవుతుందని భావించగా, 10,883 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2,147ఎకరాలకు గాను 54 ఎకరాలకే జొన్న సాగు పరిమితమైంది. 26,156 ఎకరాలకు గాను 9,044 ఎకరాల్లో మొక్కజొన్న, 2,896 ఎకరాలకు గాను 158 ఎకరాల్లో పెసర, 2,617 ఎకరాలకు గాను 444 ఎకరాల్లో అలసంద, 2112 ఎకరాకు గాను 64 ఎకరాల్లో పొద్దుతి రుగుడు, 1,123 ఎకరాలకు గాను 34 ఎకరాల్లో నువ్వులు, 3,864 ఎకరాల్లో కూరగాయలకు గాను 199 ఎకరాల్లో మాత్రమే యాసంగి సాగు అయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు.

ఇది చదవండి: కలలోకి అమ్మవారు.. దేవుడమ్మగా మారిన సంతోష్.. అసలు చరిత్ర ఇదే..!

అంతేకాకుండాయాసంగి సాగులో కరెంటే కీలకం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటుంది. కాగా జిల్లాలో ఎక్కడా 24 గంటలు కరెంట్ సప్లై కావడం లేదని రైతులు అంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 6 నుంచి 12 గంటలు మాత్రమే కరెంట్ సప్లై అవుతోందని చెబుతున్నారు. యాసంగి సాగు ఆలస్యం అయిందని, పంట చివర్లలోకరెంట్ సక్రమంగా ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరదలు, వర్షాలతో ఇప్పటికే వానాకాలం సాగులో ఆర్థికంగా నష్టపోయామని, యాసంగి సాగు లేట్ కావడంతో 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే వరి అంతంతమాత్రంగా సాగు చేసిన రైతులు ఆరుతడి పంటలైన పొద్దుతి రుగుడు, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము, జొన్న పంటలు సాగు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. కరెంట్ సప్లైపైరైతులకు భరోసా కల్పిస్తే మరిన్ని ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు