హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలకి అంతా సిద్ధం.. అభ్యర్థులకు సూచనలివే!

Bhadradri Kothagudem: ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలకి అంతా సిద్ధం.. అభ్యర్థులకు సూచనలివే!

X
అభ్యర్థులకు

అభ్యర్థులకు సూచనలు

Telangana: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్లు గా నియామకానికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలకు నిర్వహించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్లు గా నియామకానికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలకు నిర్వహించనున్నారు. ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సుమారు 25 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఖమ్మంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండగా, ఏర్పాట్లను సీపీ విష్ణు ఎస్.వారియర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తు న్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈమేరకు పరీక్షల ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో గిరిజన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఐటిడిఏ ఫిట్నెస్ ట్రైనర్ కృష్ణారావు న్యూస్ 18తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శారీరక దారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులకు తొలుత పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులకు 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వ హించనుండగా, 7నిమిషాల 15 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులు 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయొచ్చు. మహిళా అభ్యర్థులైతే 800 మీటర్ల పరుగు పందెం పరీక్ష ఉంటుంది. దీనిని 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయాలి.

అయితే ఈ పరుగు పందెంలో పాల్గొనే అభ్యర్థులు మొత్తం పందాన్ని నాలుగు భాగాలుగా విభజించి మొదటి, రెండవ భాగాలలో మోస్తరుగా పరిగెత్తాలని, మూడవ భాగంలో కాస్త నిదానంగా పరిగెట్టినప్పటికీ నాలుగవ భాగంలో శక్తిమంతా కూడ తీసుకొని లక్ష్యమే మార్గంగా పరిగెత్తాలని ఆయన సూచించారు. అభ్యర్థులు పరుగుపందానికి ముందు పరుగు పందెం పూర్తయిన తర్వాత మంచినీరు తీసుకునే విషయంలో కాస్త టైం తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా అభ్యర్థులు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, ఒకరోజు ముందుగానే పరీక్ష నిర్వహణ కేంద్రానికి చేరుకోవాలని ఆయన తెలిపారు.

అభ్యర్థులకు మానసిక ప్రశాంతత అవసరమని ముందు రోజు కంటినిండా నిద్రపోయి శరీరానికి కాస్త సేద తీర్చే విధంగా రెస్ట్ తీసుకుంటేనే ఈవెంట్లో రాణించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరుగుపందెంలో పాల్గొనబోయే ముందు అభ్యర్థులు బాడీ వామప్ పూర్తి చేసిన తర్వాత పోటీల్లో పాల్గొంటే రాణించగలరని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. లాంగ్ జంప్ పురుషులు 4 మీటర్లు, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకు 3.50మీటర్లు, మహిళా అభ్యర్ధులు 2.50 మీటర్ల కనీస దూరాన్ని సాధించాలి. షాట్ పుట్ పురుషులు / ఎక్స్ సర్వీస్ మన్ 7.26కేజీల బరువును 6మీటర్ల దూరం విసరాలి.

మహిళా అభ్యర్థులు 4కేజీల బరువును 4మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. నేపథ్యంలో అభ్యర్థులు పలు మెలుకుల ద్వారా లక్ష్యాలను సాధించవచ్చు అని అన్నారు.ఇదిలా ఉండగా డిసెంబర్ 8 నుంచి నిర్వహించబోయే ఈ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో మొదట పరుగు పందెంలో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఎత్తు కొలుస్తారు. పరుగు పందెంలో అర్హత సాధించని వారి నుంచి బ్యాండ్ తీసుకుని బయటకు పంపించనున్నారు. ఇక నిర్ణీత ఎత్తు ఉంటే లాంగ్ జంప్, ఆపై షాట్ పుట్ కు అర్హత సాధిస్తారు. అభ్యర్థులు అన్ని ఈవెంట్లలో సాధిస్తేనే. పరీక్ష మొత్తం ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ధారిస్తారు. ఏ ఈవెంట్లో అర్హత సాధించినా, సాధించకున్నా అక్కడికక్కడే అభ్యర్థులకు తెలియజేస్తారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు