హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: ఈ ఎస్పీ చేసిన పనికి సలాం కొట్టాల్సిందే.., ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?

Bhadradri: ఈ ఎస్పీ చేసిన పనికి సలాం కొట్టాల్సిందే.., ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?

గిరిజనులకు వైద్యం చేస్తున్న ఎస్పీ

గిరిజనులకు వైద్యం చేస్తున్న ఎస్పీ

ఆయన జిల్లా ఎస్పీ. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో తనములకలయ్యే పని. ఎన్నో సవాళ్లు ఇంకెన్నో ఒత్తిళ్లు ఉంటాయి. ఇంత బిజీ జీవితంలోనూ ఆయన డాక్టర్‌గా మారారు. పేషెంట్లను చేతితో తాకకుండా వైద్యం చేసే డాక్టర్లున్న ఈ రోజుల్లో ఆయన మాత్రం ఎంతో ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తోచిన వైద్య సేవ చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  ఆయన జిల్లా ఎస్పీ. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో తనములకలయ్యే పని. ఎన్నో సవాళ్లు ఇంకెన్నో ఒత్తిళ్లు ఉంటాయి. ఇంత బిజీ జీవితంలోనూ ఆయన డాక్టర్‌గా మారారు. పేషెంట్లను చేతితో తాకకుండా వైద్యం చేసే డాక్టర్లున్న ఈ రోజుల్లో ఆయన మాత్రం ఎంతో ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తోచిన వైద్య సేవ చేశారు. ఈ సంఘటనతో ఆ గ్రామస్తుల హృదయాల్లో చెరగని స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆ ఎస్పీ. ఇంతకీ ఎవరా ఎస్పీ.? ఏంటా కదా.? ద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) మణుగూరు మండలంలోని మారుమూల గుత్తికోయ గ్రామమైన బుడుగులలో వలస వచ్చిన 30 ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆదివాసీలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు మణుగూరు పోలీసులు దృష్టికొచ్చింది.

  వెంటనే ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆదివాసీలకు వైద్య చికిత్సలు అందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా బుధవారం ఆదివాసీ గిరిజన గ్రామమైన బుడుగులలో ప్రత్యేక వైద్య బృందంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు చికిత్సలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ వైద్య శిబిర నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి పాల్గొన్నారు. కనీస రవాణా సౌకర్యాలు కూడా లేని బుడుగుల గ్రామానికి ద్విచక్ర వాహనాలపై వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

  ఇది చదవండి: విధి నిర్వహణ కోసం రోజూ 8 కి.మీ కాలినడకన.., అంగన్వాడీ టీచర్ ను మెచ్చుకోవాల్సిందే..!

  స్వతహాగా డాక్టర్ అయిన ఎస్పీ వినీత్.జీ స్వయంగా పలువురికి వైద్య చికిత్సలు చేశారు. కోవిడ్ బూస్టర్ డోస్ వేసుకోకుండా ఉన్న కొందరికి స్వయంగా టీకాలు వేశారు. అనంతరం ఎస్పీ డాక్టర్ వినీత్.జి మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎల్లప్పుడూ మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అన్ని శాఖల అధికారులతో మాట్లాడి బుడుగుల గ్రామానికి తగిన సౌకర్యాలను అతి త్వరలో పోలీసు శాఖ తరపున అందిస్తామని తెలియజేసారు.

  అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు అందించారు. ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక గ్రామస్తులు సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఎస్పీ డాక్టర్ వినీత్.జీ. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మణుగూరు సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి.సాయి మనోహర్, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, ఏడూళ్ల బయ్యారం సిఐ రాజ గోపాల్, మణుగూరు సిఐ ముత్యం రమేష్, అశ్వాపురం సిఐ శ్రీనివాస్, ఎస్సైలు టి.వి.ఆర్ సూరి, రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  ఉత్తమ కథలు