హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadrachalam: రామభక్తులకు శుభవార్త.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

Bhadrachalam: రామభక్తులకు శుభవార్త.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bhadrachalam: 1 2సంవత్సరాలకొకసారి నిర్వహించే శ్రీ స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

హిందువులు భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. ఈసారి మార్చి 30న శ్రీరామ నమమి (Sri Rama Navami) వస్తోంది. భద్రాచలం (Bhadrachalam)లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సీతారాముల కల్యాణోత్సవ టికెట్లను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు రామాలయం ఈవో రమాదేవి వెల్లడించారు.

ఒకే వధువు మూడు పెళ్లిళ్లు.. సీన్ కట్ చేస్తే..

www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో కల్యాణోత్సవ టికెట్లు లభిస్తాయి. రూ.150 నుంచి ఈ టికెట్లు ప్రారంభమవుతాయి. రూ.300, రూ.1000, రూ.2వేలు, రూ.2,500, రూ.7,500 వరకు అందుబాటులో ఉంటాయి. రూ.7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేస్తారు. మిగతా టికెట్లపైూ ఒకరికే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా 16,860 మందికి కల్యాణోత్సవం టికెట్లను అందజేస్తారు. ఈ టికెట్లు ఉన్న వారు మండపంలో కూర్చొని.. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇక 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలో కూడా ఇవాళ్టి నుంచి విక్రయిస్తారు. మార్చి 31న నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి.. ఈసారి 3 రకాల ధరలతో టికెట్లను తీసుకొచ్చారు. వీటిని కూడా నేటి నుంచే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

12సంవత్సరాలకొకసారి నిర్వహించే శ్రీ స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం, కల్యాణ మంటపం, పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీకరణ ఏర్పాటు కోసం రూ.18 లక్షలు, రుత్వికులకు బహుకరించేందుకు రుత్విక్‌ సంభావనలు రూ.10 లక్షలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం హోమాలు, యాగాలు చేసే వేద పారాయణదారులకు భోజన వసతి కోసం రూ.10 లక్షలు, శ్రీ స్వామివారి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ రూ.8 లక్షలు, ఆలయం, కల్యాణ మంటపంలో పూల అలంకరణ కోసం రూ.8 లక్షలు, యాగశాల ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చు చేయనున్నారు.

ఇక భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం రూ.5 లక్షలు, చలువపందిళ్ల ఏర్పాటు కోసం రూ.4 లక్షలు, 10రోజులపాటు హోమద్రవ్యాలు కోసం రూ.3 లక్షలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం 12 నదీజలాల సేకరణకు రూ.1.44 లక్షలు కేటాయించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

First published:

Tags: Bhadrachalam, Bhadradri, Local News, Telangana

ఉత్తమ కథలు