హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ జీవో రద్దు చేయండి.. గవర్నర్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి

ఆ జీవో రద్దు చేయండి.. గవర్నర్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి

భద్రాచలంపై గవర్నర్ కు ఎమ్మెల్యే వినతి

భద్రాచలంపై గవర్నర్ కు ఎమ్మెల్యే వినతి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పెద్ద గ్రామ పంచాయతీగా పేరుందిన భద్రాచలం (Bhadrachalam) పట్టణాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పెద్ద గ్రామ పంచాయతీగా పేరుందిన భద్రాచలం (Bhadrachalam) పట్టణాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రభత్వం విడుదల చేసిన చేసిన జీఓ 45ను రద్దు చేయాలన, భద్రాచలం అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా బిల్లు ప్రవేశపెట్టిందని, దాన్ని ఆమోదించవద్దని కోరారు. ఈ నిర్ణయాన్ని భద్రాద్రి వాసులంతా వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ముంపు మండలాలను ఏపీలో కలపడంతో భద్రాచలం భూభాగం రెండు కిలోమీటర్లలోపే ఉందని, ఇప్పటికే డంపింగ్ యార్డ్ లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు మూడు పంచాయతీలుగా మారిస్తే మరిన్ని ఇక్కట్లు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.

భద్రాచలం ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు మంజూరు చేయించాలని కోరారు. దుమ్ముగూడెం మండలంలోని సీతమ్మ సాగర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాలని అసెంబ్లీలో ప్రస్తావించినా లని గప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, దీనిపైనా దృష్టి పెట్టావర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, సారపాక పట్టణాలు ఐదు పంచాయతీలుగా ఆవిర్భవించాయి.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ, శాసన మండలి ఐదు పంచాయతీల విభజనకు ఆమోదాన్ని తెలిపాయి.ఈ పరిణామంతో ఐదు పంచాయతీల ఏర్పాటు నల్లేరు మీద నడకగా మారింది. ఇక గవర్నర్ ఆమోదముద్ర మాత్రమే వేయాల్సి ఉండడంతో దాదాపు నూతన పంచాయతీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లేని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర గవర్నర్ కలిసి బిల్లుపై ఆమోదం ముద్ర వేయొద్దని కోరడం ప్రస్తుతం చర్చినీయాంశంగామారింది.

First published:

Tags: Bhadrachalam, Local News, Telangana

ఉత్తమ కథలు