హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadrachalam: గిరిజన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా పోలీస్ పరీక్షలకు శిక్షణ.. వివరాలివే..!

Bhadrachalam: గిరిజన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా పోలీస్ పరీక్షలకు శిక్షణ.. వివరాలివే..!

X
భద్రాచలం

భద్రాచలం ఐటీడీ ఆధ్వర్యంలో పోలీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ

భద్రాచలం ఐటిడిఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో సుమారు 300 మంది అభ్యర్థులకు ప్రతిరోజు ఉదయం శిక్షణ ఇస్తూ రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ తదితర ఈవెంట్లలో అర్హత సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణులైన గిరిజన అభ్యర్థులకు ఈవెంట్స్ లో అర్హత సాధించే విధంగా పలు విభాగాల్లో మెలకువలను శిక్షణ ఇస్తున్నారు. భద్రాచలం ఐటిడిఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో సుమారు 300 మంది అభ్యర్థులకు ప్రతిరోజు ఉదయం శిక్షణ ఇస్తూ రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ తదితర ఈవెంట్లలో అర్హత సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. 8 మంది ఫిజికల్ ట్రైనీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరంలో 300 మంది అభ్యర్థుల్లో 100మందికి పైగా మహిళ అభ్యర్థులు,200 మంది వరకు పురుష అభ్యర్థులు శిక్షణ పొందుతూ ఉండడం విశేషం. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే లక్ష్యంగా సాగుతున్న ఈ శిక్షణ కేంద్రంలో అభ్యర్థులు శిక్షణ తీసుకుంటూ మెలకువలు నేర్చుకుంటున్నారు.

అంతేకాకుండా జూనియర్ కాలేజీ క్రీడామైదానంలో ఉదయాన్నే రన్నింగ్, యోగ, తదితర వ్యాయామాలు చేస్తూ మానసిక దృఢత్వాన్ని పొందుతున్నారు. ఉచిత శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు శిక్షణ ప్రారంభించే సమయంలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతిరోజు ఇంకొంత పౌష్టికాహారాన్ని అందిస్తారు. భద్రాచలం కేంద్రంగా నివాసముంటూ శిక్షణ తీసుకుంటున్న ఈ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్నారు.‌

ఇది చదవండి: కోర్టులో కాంట్రాక్ట్ జాబ్స్.. రూ.40వేల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

భద్రాచలం ఐటీడీఏ అధికారుల ఆధ్వర్యంలో గిరిజన అభ్యర్థులు ఉద్యోగ సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. గ్రామాల నుంచి విద్యార్థులు పాల్గొంటూ ఈ శిబిరం ట్రైనర్ల నుంచి మెలుకువలు నేర్చుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భద్రాచలం కేంద్రంగా ఈ తరహా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ శిక్షణ శిబిరమని ట్రైనర్ కృష్ణారావు న్యూస్ 18కు తెలియజేశారు.

ఇదే శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న చర్ల మండలానికి చెందిన రమాదేవి న్యూస్ 18తో మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు ఈ శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఫిజికల్ ఈవెంట్లో పాల్గొనడం తెలిసిన విషయమైనప్పటికీ ఈ శిక్షణ శిబిరంలో సులువుగా ఈవెంట్లో గెలుపొందడం ఎలా అనే విషయాన్ని ట్రైనర్లు అర్థమయ్యే రీతిలో నేర్పుతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ శిక్షణ శిబిరంలో తనలాంటి ఎంతోమంది యువతులు మేలుకువలు నేర్చుకుంటూ ఉద్యోగ సాధన లక్ష్యంగా ముందుకుపోతున్నట్లు ఆమె తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మారుమూల గిరిజన ప్రాంతమైన భద్రాచలంలో గిరిజన యువకులకు ప్రభుత్వ ఉద్యోగ సాధన లక్ష్యంగా ఇటువంటి శిక్షణ ఇవ్వడం నిజంగా అభినందనీయం.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు