(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి వసంతపక్షపయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పట్టణపురవీధులని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచల పట్టణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు అధికారులు. ఇదే క్రమంలో ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ వేడుక జరిగే మిధున స్టేడియాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.
కోవిడ్, ఇతరత్రా కారణాలవల్ల గడిచిన రెండు సంవత్సరాలలో శ్రీరామనవమి వేడుకలను అంతరంగికంగానే పరిమితం చేయగా ఈ ఏడాది నెలకొన్న సాధారణ పరిస్థితిలో నేపథ్యంలో స్వామివారి కల్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా మిధున స్టేడియంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగానే మిధున స్టేడియంలో ఉన్న ఏకశిలా మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించగా, స్టేడియంలో ప్రత్యక్షంగా 17,000 మంది భక్తులు కళ్యాణ క్రమమును వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో సైకత శిల్పాలను రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. హనుమంతుడు, పట్టాభిషేక రాముడు.. ఇలా పలు రామాయణంలోని ఘట్టాలను అత్యంత సుందరంగా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో సైకత శిల్పాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సైకత శిల్పాల కళాకారుడు, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్టు గేదెల హరికృష్ణ, న్యూస్ 18తో ముచ్చటించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భక్తులను రామాయణ ఘట్టాలు తెలుపుతూ సైకత శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని.. జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతోభద్రాచలంలో ఆంజనేయ సైకత శిల్పం రూపొందించడం జరిగిందని తెలియజేశారు.
అంతేకాకుండావీటితో మరో రెండు శిల్పాలు కూడా చేస్తున్నట్లు హరికృష్ణ వెల్లడించారు. గుండెలను చీల్చి సీతారాములను చూపించే అపరభక్తుని శిల్పం పూర్తయిందని తెలిపారు. అంతేకాకుండా శ్రీరామపట్టాభిషేకం, సీతారాముల కల్యాణం తదితర సైకత చిత్రాలు భక్తులను అలరించే విధంగా రూపొందించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ న్యూస్ 18తో మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కొలువుతీరిన భద్రాచల పట్టణంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్టణాన్ని ఆధ్యాత్మికత సంతరించుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సైకత శిల్ప కళాకారుడు హరికృష్ణ, అతని బృందం భద్రాచల పట్టణంలో పలు సైకత శిల్పాలను తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేశారు. భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసిందని తెలుపుతూ శ్రీ రాములవారి కల్యాణానికి భక్తులను సాదరంగ ఆహ్వానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana