హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: మళ్లీ తెరపైకి భద్రాచలం 'పంచాయతీ'.. ఈసారి ఏ జరగనుంది.?

Bhadradri Kothagudem: మళ్లీ తెరపైకి భద్రాచలం 'పంచాయతీ'.. ఈసారి ఏ జరగనుంది.?

భద్రాచలం

భద్రాచలం

Bhadrachalam: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమాశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రాచలం, సారపాక గ్రామపంచాయతీల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(క్రాంతి, న్యూస్18 తెలుగు,  భద్రాద్రి కొత్తగూడెం)

తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా భద్రాచలం గ్రామపంచాయతీ అంశం మరోమారు చర్చలోకి వచ్చింది. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతుందా లేక ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన జీఓ నంబర్ 45 ప్రకారం మూడు పంచాయతీలుగా విడిపోతుందా అనే దానిపై ఈ సమావేశాల్లో సందిగ్ధత వీడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి భద్రాచలం (Bhadrachalam) మేజర్ గ్రామపంచాయతీకి 2013లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2018 ఆగస్టులో ముగిసింది. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనిభద్రాచలంతో పాటు బూర్గంపాడు మండలంలోని సారపాకను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. అయితే భద్రాచలం మున్సిపాలిటీగా ఉండటానికి గిరిజన చట్టాలు ఒప్పుకోవని, గ్రామపంచాయతీగానే కొనసాగించి ఎన్నికలు జరపాలని స్థానిక ఆదివాసీ సంఘ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో అప్పటి నుంచి పాలకవర్గం లేకుండా అధికారుల ఆధ్వర్యంలోనే పాలన సాగుతోంది. కాగా, భద్రాచలం మున్సిపాలిటీనా, గ్రామ పంచాయతీనా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్ పంచాయితీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ పంచాయతీలుగా విభజిస్తూ ప్రభుత్వం జీఓ 45 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది. భద్రాచలంలో 21 వార్డులు, సీతారాంనగర్ 17 వార్డులు, శాంతి నగర్ లో 17 వార్డులు, సారపాకలో 17 వార్డులు, ఐటీసీ గ్రామపంచాయతీలో 15 వార్డులుగా ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి, ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

ఇదిలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమాశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రాచలం, సారపాక గ్రామపంచాయతీల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు కొన్ని ఆదివాసీ సంఘాలు మినహా.. మిగిలిన అన్ని ప్రధాన పార్టీలు, పలు సంఘాలు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వినతిపత్రాలు అందజేశారు. ప్రజల వ్యతిరేకతతో ప్రభుత్వం జీఓ 45ను ఉపసంహరించుకుంటుందని ప్రచారం జరిగినా.. సర్కారు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో ఈ అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు