Kranthi Kumar, News 18, Bhadradri
భద్రాచలం ఎప్పుడు ఆధ్యాత్మికభక్తి ప్రవాహంతో ఎప్పుడు కలకల్లాడే ఓ పుణ్యక్షేత్రం. అంతేకాకుండా ఎంతోమంది కవులకు, కళాకారులకు, క్రీడాకారులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో జన్మించి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వారందరేందరో ఉన్నారు. తాజాగా భారత మహిళా అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపికైన గొంగడి త్రిష కూడా భద్రాచల ప్రాంతానికి చెందిన క్రీడాకారిణే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం నుంచి ఆటపాటల మొదలు రాజకీయాల వరకు ఎందరో మహానుభావులు ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు.
Read This : Rajanna Siricilla: టేకు చెక్కతో సీఎం కేసీఆర్ ప్రతిమ చెక్కిన వడ్రంగి కళాకారుడు
ఇలా సదరు మహనీయుల అడుగుజాడల్లో మరింతమంది వర్ధమాన కవులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులుగా ఈ ప్రాంతంలో రాణిస్తున్నారు. ఆ కోవలోకే చెందినవారుభద్రాచల పట్టణానికి చెందిన అన్నదమ్ములు గురువిద్వాన్,రిషికేష్ లు క్రికెట్ ఆటలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతోమంది యువకులకు స్ఫూర్తిప్రదాయంగా పిలుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు రివార్డులు సాధించి దూసుకెళ్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు బ్యాటింగ్‌లో దుమ్ము రేపుతుండగా మరొకరు బాలింగులో అదరగొడుతున్నారు.
గురువిద్వాన్ 2021 ఆగస్టు నుంచి 2022 నవంబర్ వరకు 90 మ్యాచులాడి 2004 పరుగులు తీశారు. ఇందులో నాలుగు సెంచరీలు 11 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2020లో నిర్వహించిన పోటీల్లో బెస్ట్ కీపర్,బెస్ట్ బ్యాట్స్‌మెన్ బహుమతులు అందుకున్నాడు. 2020లో టిసిఏ అండర్ 16 విభాగంలో వరంగల్‌లో నిర్వహించిన పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రతినిత్యం ఊహించి టోర్నమెంట్ విన్నర్‌గా బహుమతి సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బుడతడు టి20 టోర్నమెంట్లో 108 బంటుల్లో 174 పరుగులతో నాటోడుగా నిలిచి చరిత్ర సృష్టించాడు. భారత ప్రధాన టీంకు ఆడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు.
రిషికేష్
అన్నకు తగ్గ తమ్ముడుగా రిషిక 2021 నుంచి 2022 వరకు 90 మ్యాచుల్లో 101 వికెట్లను పడగొట్టి అదరహో అనిపించాడు. బెంగళూరులో జస్టి క్రికెట్ అకాడమీతో పాటు హైదరాబాదులో శిక్షణ పొందిన ఈ బుడతడు అండర్ 16 విభాగంలో రాష్ట్రస్థాయిలో పలు వికెట్లు తీసి రాణిస్తున్నాడు. రిషికేష్ ఆడిన స్టేట్ మొదటిటోర్నమెంట్లులోనే ఐదు ఓవర్లకు నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
నాగరాజు తండ్రి
ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను సరైన కోచింగ్ ఇప్పించలేకపోతున్నాను. స్పాన్సర్ లో ఎవరైనా ముందుకొచ్చి పిల్లలను ప్రోత్సహిస్తే అత్యంత ప్రతిభ కనబరుస్తారని నమ్ముతున్నారు. ఏదిఏమైనాప్పటికీ నా పిల్లలను భారత ప్రధాన జట్టులో చూడాలన్నది నా కోరిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Cricket, Local News, Telangana