హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: సంపాదన కంటే సాంప్రదాయమే ముఖ్యం.., పురాణశాస్త్రాలకు ప్రాణం పోస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..

Bhadradri: సంపాదన కంటే సాంప్రదాయమే ముఖ్యం.., పురాణశాస్త్రాలకు ప్రాణం పోస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..

పురణశాస్త్రాలపై

పురణశాస్త్రాలపై రచనల్లో భద్రాద్రి యువకుడి ప్రతిభ

Bhadradri: పద్నాలుగేళ్ల వయసులోనే రచనలకు శ్రీకారం చుట్టిన ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు 37 ఏళ్ల వయసు వచ్చేసరికి 61 గ్రంథాలు, 738 వ్యాసాలు రాశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  ఆయన చదివింది ఎంబీఏ ఫైనాన్స్ (MBA Finance). చదివిన చదువుకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా వారసత్వ, సాంప్రదాయ జీవితమే మిన్నగా భావించి గ్రంథ రచనలు చేస్తున్నారు. తన తాతగారైన శతాధిక గ్రంథకర్త తిరుమల గుదిమెళ్ళ అంతర్వేది శ్రీమన్నారాయణ చార్యుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలవ్యాస బిరుదుడిగా, బహుభాషా గ్రంథ రచయితగా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంటు హర్ష సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు ఎస్‌జి‌టి అంతర్వేది కృష్ణమాచార్యులు. పద్నాలుగేళ్ల వయసులోనే రచనలకు శ్రీకారం చుట్టిన ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు 37 ఏళ్ల వయసు వచ్చేసరికి 61 గ్రంథాలు, 738 వ్యాసాలు రాశారు. మొట్టమొదటి గ్రంథమైన భద్రాచల గోదావరి పుష్కర వైశిష్ట్యంతో ప్రారంభమైన ఆయన సాహితీయాత్ర అప్రతిహతంగా సాగుతోంది.

  పండిత వంశానికి చెందిన కృష్ణమాచార్యులు తాత, తండ్రులు అనేక గ్రంథ రచనలు చేసి చరిత్రలో నిలిచారు. కృష్ణమాచార్యులు తాత.. శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల ( ఎసీజీ ) అంతర్వేది నర్సింహాచార్యులు మహా పండితుడు. శతాధిక గ్రంథ కర్త. తండ్రి ఎన్టీజీ అంతర్వేది శ్రీమన్నారాయణాచార్యులు భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో (Sri Sitharamachandra Swamy Temple) సంస్కృత పండితులుగా పనిచేశారు. సంస్కృత పారాయణంలో వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అలా వారి సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కృష్ణమాచార్యులు ఎం.ఏ సంస్కృతం పూర్తి చేశారు.

  ఇది చదవండి: ఆ పులి భూపాలపల్లి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుందా..!

  భద్రాచలం రామాలయంలో శ్రీ రామాయణ పారాయణం కొనసాగిస్తూ గ్రంథ రచనలు చేస్తున్నారు. శ్రీచిన్న జీయర్ స్వామి, శ్రీ అష్టాక్షరీ స్వామి, శ్రీ రామచంద్రజీయర్ స్వామి, శ్రీ విధుశేఖర భారతి స్వామి తదితర మఠాధిపతుల నుంచి ప్రశంసలు, సత్కారాలు పొందారు. అంతేకాకుండా శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి మఠం తరపున కృష్ణమాచార్యులుచే 4 గ్రంథాలను రచింపచేసి ముద్రించటం విశేషం.

  ఇది చదవండి: ప్రభుత్వ కాలేజీలో చదివితే ర్యాంకులు రావన్నది ఎవరు..? వీళ్లను చూస్తే శభాష్ అంటారు..!

  ప్రముఖ పండితులు గరికపాటి నర్సింహారావు, మాడుగుల నాగఫణి శర్మ, సామవేదం షణ్ముఖ శర్మ, కందాడై రామానుజాచార్యులు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వంటి అనేక మంది పండితులు కృష్ణమాచార్యుని సాహిత్య కృషిని ప్రశంసించారు. తాత, తండ్రికి సాహితీ వారసుడిగా, భాషా సేవకుడిగా, సంస్కృతి పర్యవేక్షకుడిగా, రామాయణ పారాయణదారుడిగా , సాహితీ వనంలో దిట్టగా అంతర్వేది కృష్ణమాచార్యులు రాణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈయన ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

  ఇప్పటివరకు కృష్ణామాచార్యులు రచించిన వాటిలో 56 గ్రంథాలు, 717 వ్యాసాలు ముద్రితమై పాఠకుల ప్రశంసలు పొందాయి. 300కు పైగా కవితలు 368 శ్లోకాలు రచించారు. భారత, భాగవత, రామాయణ, పురాణ, కావ్య, శాస్త్ర సంబంధిత గ్రంథాలెన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. బాలసాహిత్యంలో బొమ్మలతో పదహారు పుస్తకాలు ముద్రితమవగా అశేష ఆదరణ లభించింది. సంస్కృతాంధ్ర కార్యకథలు, భారత దేశ నదుల చరిత్ర, వాల్మీకి సుభాషితం, ధర్మశాస్త్రకారులు వంటి గ్రంథాలు పండితుల మెప్పు పొందాయి. ఎస్‌జి‌టి అంతర్వేది కృష్ణమాచార్యుల రచనలన్నీ నేటి తరానికి సులభరీతిలో అర్ధమయ్యేలా.. విజ్ఞాన బాండాగారాలుగా ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు