హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన 'మిడ్ వైఫరీ'..! ఏమిటిది? 

Bhadradri: గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన 'మిడ్ వైఫరీ'..! ఏమిటిది? 

తెలంగాణలో

తెలంగాణలో గర్భిణిల కోసం కొత్త పథకం

మహిళల గర్భధారణ మొదలు ప్రసవం వరకు వారిని అన్ని విధాలా సురక్షితంగా ఉంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. గర్భిణీలుగా ఉన్నపుడే మహిళల్లో సరైన మోతాదులో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వాలు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  మహిళల గర్భధారణ మొదలు ప్రసవం వరకు వారిని అన్ని విధాలా సురక్షితంగా ఉంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. గర్భిణీలుగా ఉన్నపుడే మహిళల్లో సరైన మోతాదులో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వాలు. అయితే ఇంత చేసినా ప్రసవం సమయానికి అనుకోని ఇబ్బందులు తలెత్తడం లేదా ఇతర కారణాల వలన సాధారణ కాన్పులు జరగడం లేదు. అటు ఆసుపత్రుల్లోనూ సిజేరియన్ కాన్పులకే ప్రాధాన్యమిస్తూ వైద్య సిబ్బంది గర్భిణీలను ఒప్పిస్తున్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని భావించిన వైద్యారోగ్యశాఖ గర్భిణీల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా వైద్యసిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మిడ్ వైఫరీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న మిడ్ వైఫరీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది.

  రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు సి సెక్షన్ ( సిజేరియన్ ఆపరేషన్) లు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో సాధారణ కాన్పులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆలోచన నుంచి పుట్టిందే మిడ్ వైఫరీ. యూనిసెఫ్, హైదరాబాదులోని ఫెర్నాండిస్ ఆసుపత్రి వారితో కలిపి 2019లో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారులు ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సీనియర్ స్టాఫ్ నర్సులను ఎంపిక చేసి 6 నెలల పాటు హైదరాబాద్ కేంద్రంగా మిడ్ వైఫరీ విధానంలో శిక్షణ ఇవ్వగా, అనంతరం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను గుర్తించి ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు.

  ఇది చదవండి: అడవిలో సివంగులు: మావోయిస్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్

  ఇందులో భాగంగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రిని కూడా ఎంపిక చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి కేంద్రంగా 2019 మే 1న మిడ్ వైఫరీ పథకాన్ని ప్రారంభించగా నాటి నుంచి నేటి వరకు సుమారు 4 వేలకు పైగా సాధారణ ప్రసవాలు జరగడం విశేషం. హెడ్ నర్స్ విజయశ్రీ ఆధ్వర్యంలో భద్రాచలంలో మిడ్ వైఫరీ ప్రోగ్రాం అమలవుతుండగా, ఏడు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవం అయ్యేందుకు పలు రకాల వ్యాయామాలతో పాటు తీసుకోవలసిన పౌష్టికాహారం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణీ స్త్రీలలో మనోధైర్యాన్ని నింపుతూ సాధారణ ప్రసవం అయ్యేలా విజయశ్రీ కృషి చేస్తున్నారు.

  ఇది చదవండి: తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండాలనుకున్నాడు, కానీ కడుపుకోత మిగిల్చాడు

  మిడ్ వైఫరీ పథకం అమలుకు పూర్వం 75 శాతం వరకు ఉన్న సిజేరియన్ ఆపరేషన్లను హార్డ్ నర్స్ విజయశ్రీ బృందం 35 శాతానికి తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారుల చేత ప్రశంసలను అందుకున్నారు. అంతేకాక 2020 సెప్టెంబర్ నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మిడ్ వైఫరీ లెడ్ కోర్ యూనిట్ (ఎంఎన్సీయు)ను ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఓపిని సైతం నిర్వహిస్తున్నారు. గర్భం దాల్చిన స్త్రీలు ఏరియా ఆసుపత్రికి చికిత్సకు వచ్చే తొలి రోజుల్లోనే వారికి స్క్రీనింగ్ నిర్వహించి హై రిస్క్ డెలివరీ నా, లో రిస్క్ డెలివరీనా గుర్తించడం జరుగుతుంది.

  హై రిస్క్ డెలివరీ అవకాశం ఉన్న గర్భిణీ స్త్రీలను గైనకాలజిస్ట్ వద్దకు పంపిస్తుండగా లోరిస్క్ డెలివరీ అవకాశం ఉన్న గర్భిణీ స్త్రీలను పర్యవేక్షిస్తుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఆసుపత్రులలో ఈ పథకం విజయవంతం అవడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులలో మిడ్ వైఫరీ పథకాన్ని అమలుపరిచేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు