హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: బూజు పట్టిన లడ్డులను అమ్మిన వివాదంలో బాధ్యులపై చర్యలేవి..?

Bhadradri Kothagudem: బూజు పట్టిన లడ్డులను అమ్మిన వివాదంలో బాధ్యులపై చర్యలేవి..?

లడ్డూల వివాదం

లడ్డూల వివాదం

Telangana: దేశంలో రెండో అయోధ్యగా కీర్తింపబడుతున్న భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా అమ్మకాలు జరిపిన లడ్డూల నాణ్యతపై పెద్ద వివాదమే తలెత్తగా ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి

దేశంలో రెండో అయోధ్యగా కీర్తింపబడుతున్న భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా అమ్మకాలు జరిపిన లడ్డూల నాణ్యతపై పెద్ద వివాదమే తలెత్తగా ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు, మూడు రోజులు ఇదే విషయం సంచలనాత్మకంగా నడిచింది. భక్తులకు జరుగుతున్న అన్యాయంపై స్థానిక మేజిస్ట్రీట్ స్పందించి సుమోటోగా కేసు స్వీకరించడంతో రామభక్తులందరూ హర్షం వ్యక్తం చేశారు.

వంటశాలను సీజ్ చేసేందుకు వెళ్ళిన పోలీస్ సిబ్బందిని దేవస్థానం సిబ్బంది అడ్డగించడం వంటి పరిస్థితులు తలెత్తాయి. అనంతరం ఫుడ్ ఇన్సెస్పెక్టర్ వచ్చి నాణ్యత లోపించిన లడ్డూలను అందిస్తున్నారా?, అసలు విషయాన్ని తెలుసుకునేందుకు లడ్డూలను సీజ్ చేసి హైదరాబాద్ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలోగతంలో భద్రాచలం రామాలయం విషయమై అనేక అభియోగాలు వెలువడ్డాయి. సామాజిక మాధ్యమాలు, వార్తా పత్రికల్లో ఎన్నో వార్తలు వచ్చాయి.

ఏ అధికారి కూడా రామాలయంలో జరుగుతున్న విషయాలు తెలిసి కూడా రకరకాల కారణాలతో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మొట్ట మొదటి సారిగా స్థానిక మేజిస్ట్రేట్ నీలిమ భక్తులకు కలుగుతున్న ఇబ్బందులపై స్పందించి సుమోటోగా కేసు స్వీకరించి చర్యలు చేపట్టారు. దీనిపై ప్రజలలో ఆమె పట్ల ప్రశంసలు వెలువెత్తాయి.

ఇంత వరకు అంతా బాగానే ఉన్నా రామభక్తులు గానీ, స్థానికులు గానీ, ఇతర స్వచ్ఛంద సంస్థలవారూ కూడా ఈ విషయంపై దేవాలయ అధికారులను వివరణ కోరలేదు. జరిగిన విషయంపై గట్టిగా స్పందించనూ లేదు. ఈ క్రమంలో ఓ నికార్సైనఅధికారిణి ప్రజల కోసం చేపట్టిన చర్యకు పూర్తిస్థాయిలో మద్దతు లభించలేదు. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఏళ్ళ తరబడి తిష్టవేసిన కొంత మంది దురుసు ప్రవర్తన కారణంగానే లడ్డూల విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని అనధికారిక సమాచారం.

ఆలయ ప్రాంగణంలో విఐపిలు, తదితరులకు సౌకర్యాలు కల్పించాల్సిన కొందరు సిబ్బంది దురుసు మాటల వలనే ఓ విఐపి కుటుంబానికి చెందిన వ్యక్తులు నొచ్చుకున్నారని, ఈ కారణం చేతే బూజుపట్టిన లడ్డూల వ్యవహారం మొత్తం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిందనేది ఓ సమాచారం. మరోవైపు లడ్డూలు తయారు చేసే గుత్తేదారుడి వ్యవహారంపై విభేదించిన కొందరు స్థానికులు లడ్డూల గుత్తేదారులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాను, ఇతరులను ప్రోత్సహించారనేది మరో సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా వివాదం తలెత్తి చాలా రోజులైనప్పటికీ నేటి వరకు గుత్తేదారుడిని గానీ, ఆ సమయంలో ఇంచార్జ్ వ్యవహరించిన సూపరింటెండెంట్ ను గానీ, లడ్డూల వ్యవహారం నడిపించే సిబ్బందిలో ఏ ఒక్కరిపై గానీ దేవాలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ నాణ్యత లోపించిన లడ్డూలను విక్రయించిన క్రమంలో గుడ్డిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే చట్టపరంగా తాము కూడా దేవస్థానం అధికారుల విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్థానికులు కొందరు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు