హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: పదేళ్లగా శ్రీరాముని సన్నిధికి విచ్చేసే ఓ బృందం.. ఎందుకో తెలుసా?

Bhadradri Kothagudem: పదేళ్లగా శ్రీరాముని సన్నిధికి విచ్చేసే ఓ బృందం.. ఎందుకో తెలుసా?

X
స్వామి

స్వామి వారి సన్నిధికి భక్తులు

Telangana: పూర్వం తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో సాయంత్రమైందంటే చాలు ఊర్లో ఉండే ఆలయాలలో భక్తి పాటలు, భజన కార్యక్రమాలతో సందడి వాతావరణం ఉంది. ప్రతినిత్యం రోజంతా కాయకష్టం చేసుకుని బతుకు బండి లాగే శ్రమజీవులు సాయంత్రానికి ఊర్లో ఉన్న గుడి వద్దకు చేరి కాసేపు కచేరి, భజనలు, భగవత్ నామ సంకీర్తనలతో కాలక్షేపం చేసేవారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి కొత్తగూడెం

పూర్వం తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో సాయంత్రమైందంటే చాలు ఊర్లో ఉండే ఆలయాలలో భక్తి పాటలు, భజన కార్యక్రమాలతో సందడి వాతావరణం ఉంది. ప్రతినిత్యం రోజంతా కాయకష్టం చేసుకుని బతుకు బండి లాగే శ్రమజీవులు సాయంత్రానికి ఊర్లో ఉన్న గుడి వద్దకు చేరి కాసేపు కచేరి, భజనలు, భగవత్ నామ సంకీర్తనలతో కాలక్షేపం చేసేవారు.

అప్పట్లో ఇటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం జరగడం వల్ల చిన్నతనం నుంచే ఆధ్యాత్మికచింతన పెరగడంతో పాటు సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై పట్టు ఏర్పడేది. కానీ ప్రస్తుతం లోకం తీరు మారింది. ఆధ్యాత్మికచింతన అటు ఉంచితే కనీసం సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలపై కనీస అవగాహన కూడా కరువవుతుంది నేటి తరానికి. ఈ తరుణంలో సన్నగిల్లుతున్న ఆధ్యాత్మికచింతనకు మళ్లీ పునర్వైభవం తీసుకురావడానికి తెలుగు రాష్ట్రాలలో సుమారు 40 వేల మందిపైగా నడుం బిగించారు.

శ్రీరామదాసు భజన మండలి పేరుతో ఊరువాడ చిన్న పెద్ద తేడా లేకుండా భగవత్ నామ సంకీర్తనలతో, భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికచింతనను పెంపొందిస్తూ ముందుకెళుతున్నారు. ఇదిలా ఉండగా సదరు భజన మండలి సభ్యులుప్రతినెలలో పునర్వసు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చి ఆలయంలో పలు కీర్తనలు ఆలపించి, భజనాధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ప్రయాణం అవుతారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న శ్రీ రామదాసు భజన మండలి సభ్యులను ప్రతినెల పుర్వసునాడు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి తీసుకువచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు.

ఆరు పదుల వయసులో పలువురు మహిళలు సైతం శ్రీ రామదాసు భజన మండలి సభ్యులుగా ఉంటూ భజన, భగవత్ నామ కీర్తనలు ఆలపిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు భజనలు చేయడం వలన ఉపయోగాలు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. భజన చేయ్యడం వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయని ప్రతీతి. సామూహికంగా భగవంతుడి నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుందట.

పది మందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతున్ని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరచిపోయి నూతన ఉత్తేజం పొంది ఉత్సాహవంతులమవుతామట. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు. భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుందట.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు