హోమ్ /వార్తలు /తెలంగాణ /

సేవలు గుర్తించిన ప్రభుత్వం.. అరుదైన పథకంతో గౌరవం!

సేవలు గుర్తించిన ప్రభుత్వం.. అరుదైన పథకంతో గౌరవం!

కమాండర్ ను అభినందిస్తున్న అధికారులు

కమాండర్ ను అభినందిస్తున్న అధికారులు

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని 141 సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Kranthi Kumar, News 18, Bhadradri)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని 141 సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఎస్. సింగరవేల్ ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ అవార్డురాగా దానిని ఇటివలే చతిస్గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ పరిధిలోని చరణ్ పూర్ వద్దసిఆర్పిఎఫ్ డిజి డాక్టర్ సంజయ్ లాల్ థామస్ అందజేశారు.

దీంతో భద్రాచలంలోని 141 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ దార్ తో పాటు పలువురు సహచర అధికారులు సిబ్బంది అవార్డు పొందిన డిప్యూటీ కమాండర్ సింగర్ వేల్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ విభాగంలో 1993లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నత దళంలో చేరారు.జమ్మూ & కాశ్మీర్‌లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, బీహార్ , (జెహనాబాద్ జిల్లా) మరియు గతంలో బీజాపూర్ ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించారు.

వివిధ ర్యాంక్‌లు, సామర్థ్యాలు మరియు పదవీకాలాలతో NSGలో సేవ చేసే అవకాశాన్ని పొందారు. ఎలైట్ ఫోర్స్‌లో వివిధ అసైన్‌మెంట్‌లలో చురుకుగా పాల్గొని NSG ఫోర్స్ కమాండర్ నుండి ప్రశంసలు పొందారు. 2008లో అమర్‌నాథ్ ల్యాండ్ సమస్య కారణంగా అత్యంత అస్థిర పరిస్థితుల్లో 82 బిఎన్ సీఆర్పీఎఫ్  కోయ్ కమాండర్ చురుకుగా వివిధ కాయ్‌లకు కమాండర్‌గా వ్యవహరించారు.

ఆ తర్వాత 2010-2011 సంవత్సరంలో శ్రీనగర్‌లో చెలరేగిన లా అండ్ ఆర్డర్ పరిస్థితిని, మానవ హక్కులను ఉల్లంఘించకుండా, విజయవంతంగా పరిష్కరించారు. దేశంలోని శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లో ప్రశంసనీయ పనితీరు, విధి పట్ల అంకితభావానికి గుర్తింపుగా ప్రతిభావంతులైన సేవకు రాష్ట్రపతి పతకానికి సిఫార్సు చేయబడింది. దీంతో ఆ పథకాన్ని సోమవారం నాడు చరణ్పూర్ జగదల్పూర్ వద్ద సిఆర్పిఎఫ్ డి జి సంజయ్ లాల్ థామస్ వద్ద తీసుకున్నారు.

దేశ రక్షణలో భాగంగా నిత్యం వృత్తియందు నిబంధనతో పనిచేసే వ్యక్తిగాసింగర్ వేల్ కు రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ అవార్డు లభించడం ఆనందంగా ఉందని స్థానిక సిబ్బంది అంటున్నారు. ఇదిలా ఉండగా పోలీస్ అంటే కఠినత్వం, ఖాకీ అంటే కఠోరం, తుపాకీతో బెదిరిస్తారని, లాఠీతో భయపెడతారనే నానుడి.. వాళ్ల డ్రెస్ కోడ్ లో కఠినత్వం దాగి ఉంటుందని, చుట్టాలు, స్నేహితులు, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా పోలీస్ బ్రెయిన్ తోనే చూస్తారనే వాదన వింటుంటాం. కానీ అందుకు పూర్తి భిన్నమైన స్వభావం కలిగిన వ్యక్తిగా సింగర్ వేల్కు పేరుంది. కింద స్థాయి సిబ్బందితో కలివిడిగా కలిసిపోయి నిత్యం సిబ్బందికి అందుబాటులో ఉండే వ్యక్తి సింగర్ వేల్ అని భద్రాచలం సీఆర్పీఎఫ్ సిబ్బంది అంటున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, CRPF, Local News, Telangana

ఉత్తమ కథలు