హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రకృతి వ్యవసాయంతో రెండు చేతులా సంపాదిస్తున్న రైతు.. ఆ సీక్రెట్ ఏంటో మీరే చూడండి..

ప్రకృతి వ్యవసాయంతో రెండు చేతులా సంపాదిస్తున్న రైతు.. ఆ సీక్రెట్ ఏంటో మీరే చూడండి..

సేంద్రియ

సేంద్రియ వ్యవసాయంతో రైతుకు లాభాలు

ప్రకృతి వ్యవసాయ పద్ధతి (Natural Farming) లో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతో పాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కాపాడవచ్చని ఇప్పటికే రుజువైన విషయం.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  ప్రకృతి వ్యవసాయ పద్ధతి (Natural Farming) లో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతో పాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కాపాడవచ్చని ఇప్పటికే రుజువైన విషయం. స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి సహజసిద్ధ వనరులతోనే ఆరోగ్యదాయకమైన పంట ఉత్పత్తులను పండించుకోవటం ఎంతో ఆవశ్యకమైన అంశంగా అందరి గ్రహింపునకు వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే పలువురు రైతులు తమ సాగులో రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి సేంద్రీయ పద్ధతిలో స్వయంగా ఎరువులు తయారు చేసుకుని పంటల సాగులో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా భూమి సారవంతంగా తయారు చేసేందుకు, పంట పొలాల్లో వచ్చే తెగులను నివారించేందుకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసుకుని నేడు సేద్యం చేయడం పరిపాటిగా మారింది.

  జీవామృతాన్ని తయారు చేసుకొని తన సొంత పొలానికి వాడడమే కాకుండా ఇరుగుపొరుగు రైతులకు విక్రయించి మంచి లాభాలను అర్ధిస్తున్నాడు ఓ రైతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మద్దికొండ గ్రామానికి చెందిన కాసాని చంద్రమోహన్ పామాయిల్ సాగు చేసే రైతు. తనకున్న 80 ఎకరాలలో పామాయిల్ తోటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మొదట్లో పామాయిల్ తోట సేద్యం చేసే సమయంలో అధిక నీటి తడులు, రసాయనిక ఎరువులు అధిక మొత్తంలో వాడడంతో తోటలకు పలు రకాల తెగుళ్లు వ్యాపించాయి. మట్టి కూడా సారం కోల్పోతున్న విషయాన్నీ గ్రహించిన రైతు చంద్రమోహన్ పలువురు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో చర్చించి పామాయిల్ సాగులో జీవామృతం ద్వారా తెగుళ్లను నివారించవచ్చని తెలుసుకున్నాడు.

  ఇది చదవండి: ఏజెన్సీ ఏరియాలో కూచిపూడి నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ మాస్టారు

  అనంతరం తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేసి గోవుల మలమూత్రాలను సేకరించేందుకు విడివిడిగా రెండు భారీ సిమెంటు తొట్టెలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగిస్తూ జీవామృతాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు రైతు చంద్రమోహన్. ఇలా తయారైన జీవామృతాన్ని తన పామాయిల్ తోటలో పిచికారి చేయగా సత్ఫలితాలు రాసాగాయి. తన వ్యవసాయ క్షేత్రంలోనే జీవామృతాన్ని తయారు చేసి, తన వ్యవసాయ అవసరాలకుపోగా మిగిలిన జీవామృతాన్ని తోటి రైతులకు విక్రయించి మంచి లాభాలు పొందుతున్నాడు. లీటర్ జీవామృతం రూ.3-4లకు అమ్ముతూ నెలకు రూ. 40 - 50 వేల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నానని కాసాని చంద్రమోహన్ అంటున్నారు. జీవామృతం వాడడం వల్ల భూమి మరింత సారవంతంగా తయారవడమే కాక, పంట పొలాలలో వ్యాపించే తెగుళ్లు నివారించవచ్చని చెప్పుకొచ్చాడు.

  ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

  అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి గో మలమూత్రాల ద్వారా తయారుచేసిన జీవామృతాన్ని సిమెంటు తొట్టెలో భద్రపరిచి అనంతరం అది మరింత ప్రభావవంతంగా తయారవ్వడానికి బెల్లం లాంటి పదార్థాలను కలుపుతున్నట్లు ఆయన తెలియజేశాడు. ఇలా సేకరించిన మిశ్రమం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుందని అప్పటి నుంచి 9 నుండి 12 రోజుల మధ్య కాలంలో సూక్ష్మజీవులు వృద్ధి అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చంద్రమోహన్ అంటున్నాడు.

  ఈ జీవామృతాన్ని వాడడం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయని నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపావులు చైతన్యవంతం అయి భూసారం పెరగడానికి దోహదపడుతాయని ఆయన అంటున్నాడు. జీవామృతం తయారీ మరియు అందులో సందేహాల నివృత్తికై రైతు చంద్రమోహన్ ను సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9440002618.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadrari kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు